News November 24, 2024
ఈ నెల 29న విశాఖకు ప్రధాని

AP: ఈ నెల 29న ప్రధాని మోదీ విశాఖపట్నంకు రానున్నారు. సాయంత్రం ఏయూ మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ క్రమంలో వర్చువల్‌గానే హైడ్రో ప్రాజెక్టుకు, ఫార్మా ఎస్ఈజెడ్లో స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై సీఎస్ నీరభ్ కుమార్ ఇవాళ, రేపు విశాఖలో సమీక్షించనున్నారు.
Similar News
News December 7, 2025
NRPT: రేపు డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమం

రేపు సోమవారం డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నారాయణపేట జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని ప్రజలు తమ సమస్యలను 08506 281182 ఫోన్ నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలని అన్నారు. సమస్యలను పరిశీలించి చట్టం ప్రకారం పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పరు. జిల్లా ప్రజలు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
News December 7, 2025
‘బాబ్రీ’ పేరుతో రాజకీయాలు వద్దు: కాంగ్రెస్ MP

టీఎంసీ బహిష్కృత నేత, MLA హుమాయున్ కబీర్‌పై బెంగాల్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ డిమాండ్ చేశారు. బాబ్రీ తరహా మసీదు నిర్మాణం పేరుతో దేశంలో విద్వేషపూరిత వాతావరణం సృష్టించడమే టార్గెట్‌గా కామెంట్లు చేశారని మండిపడ్డారు. మసీదు నిర్మించుకోవచ్చని, దాని పేరుతో రాజకీయాలు చేయొద్దన్నారు. ఈ వివాదం వెనుక బీజేపీ ఉందని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ తరఫున కబీర్ పోటీ చేశారన్నారు.
News December 7, 2025
వైట్ హెడ్స్‌ని ఇలా వదిలిద్దాం..

శీతాకాలంలో ఎదురయ్యే చర్మ సమస్యల్లో వైట్ హెడ్స్ ఒకటి. వీటిని తగ్గించడానికి కొన్ని ఇంటి చిట్కాలు..* వేపాకులు, పసుపు పేస్ట్ చేసి దాన్ని వైట్ హెడ్స్‌పై రాసి పావుగంట తర్వాత కడిగేస్తే చాలు. * సెనగపిండి, పెసర పిండి, పాలు, కాస్త నిమ్మరసం కలిపి పేస్ట్ చేసి 20నిమిషాల పాటు ముఖానికి ఉంచి కడిగేయాలి. * వంటసోడాలో నీళ్లు కలిపి ఈ మిశ్రమాన్ని వైట్‌హెడ్స్‌పై రాయాలి. కాసేపటి తర్వాత నీళ్లతో కడిగేయాలి.


