News August 10, 2024

ఆర్మీ నిర్మించిన వంతెనపై ప్రధాని

image

వయనాడ్ (కేరళ)లో ప్రకృతి విధ్వంసాన్ని ప్రధాని మోదీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చూరల్మలా, ముండక్కై గ్రామాల్లో ఏరియల్‌ సర్వే చేపట్టారు. అనంతరం ఆర్మీ నిర్మించిన వంతెనపై నడుస్తూ అక్కడ జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు. ఈ 190 అడుగుల పొడవైన బ్రిడ్జిని భారత ఆర్మీకి చెందిన ‘మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్’ 36 గంటల్లోనే నిర్మించింది. దీంతో చూరల్మలా-ముండక్కై గ్రామాల మధ్య సహాయక చర్యలు వేగవంతమయ్యాయి.

Similar News

News November 1, 2025

కోళ్లలో రక్తపారుడు.. తీవ్రమైతే మరణం తప్పదు

image

కోళ్లలో వైరస్, సూక్ష్మజీవుల వల్ల రక్తపారుడు వ్యాధి వస్తుంది. ఇది కూడా చిన్న కోడి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగం వస్తే కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధి బారినపడ్డ కోడి పిల్లలు ఒకేచోట గుమిగూడి రక్త విరేచనాలతో బాధపడతాయి. లక్షణాలు మరీ తీవ్రంగా మారితే కోడి పిల్లలు మరణించే అవకాశం ఉంది. వ్యాధి నివారణకు లిట్టరును పొడిగా ఉంచాలి. వెటర్నరీ నిపుణులకు తెలిపి వారి సలహాలను పాటించాలి.

News November 1, 2025

టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ <>ముజఫర్‌పూర్‌<<>> 14 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 14న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. టెన్త్, ఐటీఐ(మెకానికల్) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 27ఏళ్లు. వెబ్‌సైట్: https://tmc.gov.in

News November 1, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.280 తగ్గి రూ.1,23,000కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 పతనమై రూ.1,12,750 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1000 పెరిగి రూ.1,66,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.