News August 15, 2024

UCC అమలు చేయాలన్న ప్రధాని.. అసద్ ఏమన్నారంటే?

image

దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్(UCC) ఉండాల్సిన అవసరం ఉందని PM మోదీ వ్యాఖ్యానించడంపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ‘బీజేపీ UCC వెర్షన్‌లో HUF, షెడ్యూల్స్ కులాలకు, హిందూ ఆచారాలకు మినహాయింపు ఇచ్చారు. హిందువుల్లో దాయభాగ, మితాక్షర వంటి తేడాలున్నాయి. మరి వాటి సంగతేంటి? ఉత్తరాఖండ్‌లో అమలవుతోన్న UCC బీజేపీ వంచనకు సరైన నిర్వచనం. ఇది హిందువుల సంప్రదాయాన్ని మిగతా వారిపై రుద్దుతోంది’ అని ట్వీట్ చేశారు.

Similar News

News December 3, 2025

పాడి రైతులు ఈ విషయం గుర్తుంచుకోవాలి

image

రోజుకు రెండు లీటర్లు పాలిచ్చే 5 ఆవులను పోషించే బదులు.. రోజుకు 10 లీటర్లు పాలిచ్చే ఒక సంకరజాతి ఆవును పోషించడం ఎంతో లాభసాటిగా ఉంటుందని వెటర్నరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాడి పశువుల పోషణ వ్యయంలో 60 నుంచి 70 శాతం వ్యయం దాణా, గడ్డి, మందులకే ఖర్చవుతుంది. పాడి పరిశ్రమను లాభసాటిగా సాగించాలంటే పాడి పశువుల మేపుపై అదుపు, సంకరజాతి పశువుల పోషణపై సరైన అవగాహన కలిగి ఉండాలని నిపుణులు చెబుతున్నారు.

News December 3, 2025

విశాఖలో 12 నుంచి కాగ్నిజెంట్ కార్యకలాపాలు

image

AP: ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ విశాఖలో ఈ నెల 12 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. ప్రస్తుతం ఐటీ పార్కులోని తాత్కాలిక భవనంలో తన సెంటర్ ఏర్పాటు చేయనుంది. అదే రోజు కాపులుప్పాడలో ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. 2028 జూన్ నాటికి తొలి దశ నిర్మాణాలు పూర్తవుతాయని సమాచారం.

News December 3, 2025

పెళ్లి కాని వారు సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించవచ్చా?

image

పెళ్లికాని వారు కూడా సత్యనారాయణస్వామి వ్రతాన్ని నిరభ్యంతరంగా ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు. సాయంత్రం వేళలో చేసే ఈ వ్రతానికి అధిక ఫలితం ఉంటుందని అంటున్నారు. ‘ఈ వ్రతాన్ని ఇంట్లోనే కాకుండా ఆలయాలు, నదీ తీరాలు, సాగర సంగమాల వద్ద కూడా చేసుకోవచ్చు. స్వామివారి కథ విన్నా కూడా శుభం జరుగుతుంది. ఇంట్లో ఏదైనా అశుభం జరిగినప్పుడు, సూతకం వంటివి ఉన్నప్పుడు వ్రతాన్ని చేయకపోవడం మంచిది’ అంటున్నారు.