News February 4, 2025

కేసీఆర్‌ కుటుంబానికి ప్రధాని సానుభూతి

image

TG: బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రధాని మోదీ లేఖ రాశారు. ఇటీవల కేసీఆర్ సోదరి సకలమ్మ మరణించడంతో సంతాప సందేశం తెలియజేశారు. అక్క మరణంతో బాధలో ఉన్న గులాబీ బాస్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Similar News

News November 16, 2025

జాతీయ స్థాయికి వానపల్లి విద్యార్థిని

image

కొత్తపేట మండలం వానపల్లి జడ్పీ హైస్కూల్ విద్యార్థిని పలివెల లావణ్య టెన్నికాయిట్ పోటీల్లో జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. బాపట్ల జిల్లా చీరాలలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో విజయం సాధించి ఆమె ఈ అర్హత సాధించారు. ఈ విషయాన్ని హెచ్‌ఎం ముద్రగడ వెంకటేశ్వరరావు శనివారం వెల్లడించారు. ఈ నెల 26 నుంచి 30 వరకు జమ్మూ కశ్మీర్‌లో జరిగే జాతీయ పోటీల్లో లావణ్య పాల్గొననున్నారు.

News November 16, 2025

రేపే కార్తీక మాస చివరి సోమవారం.. ఇలా చేస్తే కోటి జన్మల పుణ్యం

image

రేపు కార్తీక మాసంలో చివరి సోమవారం. గత సోమవారాలు, పౌర్ణమి వేళ 365 వత్తుల దీపం వెలిగించని, దీపదానం చేయని వారు రేపు ఆ లోపాన్ని సరిదిద్దుకోవచ్చని పండితులు చెబుతున్నారు. ఈ ఒక్క రోజు శివారాధన కోటి సోమవారాల ఫలితాన్ని, కోటి జన్మల పుణ్యాన్ని ఇస్తుందని నమ్ముతారు. రేపు ప్రదోష కాలంలో ఆవు నెయ్యితో దీపారాధన చేసి, శివుడి గుడిలో దీపదానం చేస్తే శుభకరమని సూచిస్తున్నారు. మరిన్ని ఆధ్యాత్మిక కథనాల కోసం <<-se_10013>>భక్తి<<>>.

News November 16, 2025

నేడు నాన్ వెజ్ తినవచ్చా?

image

కార్తీక మాసంలో రేపు(చివరి సోమవారం) శివాలయాలకు వెళ్లేవారు, దీపారాధన, దీపదానం చేయువారు నేడు నాన్ వెజ్ తినకూడదని పండితులు సూచిస్తున్నారు. అది కడుపులోనే ఉండి రేపటి పూజకు అవసరమైన శరీర పవిత్రతను దెబ్బ తీస్తుందని అంటున్నారు. ‘మాంసాహారం రజోతమో గుణాలను ప్రేరేపించి, దైవారాధనలో ఆటంకం కలిగించవచ్చు. కాబట్టి శివానుగ్రహాన్ని పొందడానికి, పూజ ఫలం కలగడానికి నేడు సాత్విక ఆహారం స్వీకరించడం ఉత్తమం’ అంటున్నారు.