News April 6, 2025

స్టాలిన్ వ్యాఖ్యలకు ప్రధాని కౌంటర్

image

తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చాక తమిళనాడుకు 300% అధికంగా నిధులు ఇచ్చామని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో రూ.8,300 కోట్ల విలువైన జాతీయ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. కేంద్రం తమ రాష్ట్రానికి నిధులు కేటాయించలేదన్న సీఎం స్టాలిన్ వ్యాఖ్యలకు ప్రధాని కౌంటర్ ఇచ్చారు. రైల్వే బడ్జెట్‌లో 700శాతం అధికంగా నిధులు కేటాయించామన్నారు. మరోవైపు మోదీ కార్యక్రమాన్ని ఎంకే స్టాలిన్ బహిష్కరించారు.

Similar News

News November 13, 2025

17కు చిన్నఅప్పన్న బెయిల్ పిటిషన్ వాయిదా

image

కల్తీ నెయ్యి కేసులో TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డి PA చిన్న అప్పన్న బెయిల్ పిటిషన్ ఈనెల 17కు వాయిదా పడింది. నెల్లూరు సీబీఐ కోర్టులో బుధవారం విచారణ జరగ్గా.. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయశేఖర్ వాదనలు వినిపించారు. నిందితుడికి బెయిల్ ఇస్తే సాక్షాలు తారుమారయ్యే అవకాశం ఉందనన్నారు. మరో వైపు సీబీఐ అధికారులు సైతం కస్టడీ పిటిషన్ వేశారు. 17న కస్టడీ లేదా బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.

News November 13, 2025

తెలంగాణ ముచ్చట్లు

image

* ఉన్నతాధికారులు పర్మిషన్ లేకుండా స్కూల్ నుంచి విద్యార్థులను బయటకు తీసుకెళ్లొద్దని హెడ్మాస్టర్లకు ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలు
* ఫిరాయింపు MLAలను రేపు, ఎల్లుండి అసెంబ్లీలోని కార్యాలయంలో విచారించనున్న స్పీకర్ గడ్డం ప్రసాద్
* ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు 34,023 మందికి స్వచ్ఛ భారత్ మిషన్ కింద మరుగు దొడ్లు మంజూరు
* ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో టాప్-3లో జనగాం, ఖమ్మం, యాదాద్రి.. నిర్మాణ పనుల్లో 70% పురోగతి

News November 13, 2025

పదునెట్టాంబడి అంటే ఏంటి?

image

పదునెట్టాంబడి అంటే అయ్యప్ప స్వామి ఆలయంలో ఉండే 18 మెట్లు. ఈ మెట్లు మనిషి పరిపూర్ణత సాధించిన జ్ఞానానికి సంకేతాలు. జ్ఞాన సాధన చేసే అయ్యప్ప స్వాములు మాత్రమే వీటిని ఎక్కుతారు. వారికి ప్రత్యేకంగా పడిపూజ చేస్తారు. ఈ మెట్లు ఎక్కడం అనేది జ్ఞాన మార్గంలో సాగే ఆధ్యాత్మిక ప్రయాణానికి గుర్తుగా భావిస్తారు. ప్రతి మెట్టూ అజ్ఞానాన్ని, అహంకారాన్ని తొలగిస్తుంది. పరిశుద్ధమైన మనసుతోనే ఈ మెట్లెక్కాలి. <<-se>>#AyyappaMala<<>>