News January 15, 2025
క్యాన్సర్ నుంచి కోలుకుంటున్నా: యువరాణి కేట్

బ్రిటన్ యువరాజు విలియమ్ భార్య, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ తాను కాన్సర్ నుంచి బయటపడినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు కాస్త రిలీఫ్‌గా ఉందని పూర్తిగా కోలుకోవడంపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. గత ఏడాది క్యాన్సర్ బారిన పడినట్లు ప్రకటించిన కేట్ కొంతకాలంగా చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.
Similar News
News January 6, 2026
ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ.. ఎప్పుడంటే?

అగ్నివీర్ పోస్టుల భర్తీ కోసం సికింద్రాబాద్‌లోని AOC సెంటర్‌లో ఫిబ్రవరి 2 నుంచి మే 10 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. ఇందులో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, క్లర్క్, చెఫ్, సపోర్ట్ స్టాఫ్, ట్రేడ్స్‌మెన్ తదితర విభాగాల్లో నియామకాలు జరగనున్నాయి. 17.5 నుంచి 21 ఏళ్ల మధ్య ఉన్నవారు అర్హులు. పోస్టులను బట్టి టెన్త్, ఇంటర్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక <
News January 6, 2026
థైరాయిడ్ పేషెంట్లు శీతాకాలంలో ఇవి తినకూడదు

థైరాయిడ్ రోగులు శీతాకాలంలో వేయించిన, కారంగా ఉండే ఆహారం, జంక్ ఫుడ్ తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అలాగే సోయా ఉత్పత్తులు, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ, షుగర్, శుద్ధి చేసిన పిండి, బేకరీ ఉత్పత్తులు, టీ, కాఫీ ఎక్కువగా తీసుకోకూడదు. ఈ కాలంలో థైరాయిడ్ రోగులు సమతుల్యమైన, పోషకమైన ఆహారం తీసుకోవాలి. నట్స్, సీడ్స్, ఫ్రూట్స్, కూరగాయలు, తగినంత ప్రోటీన్ తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
News January 6, 2026
282 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

CSI ఈ గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ 282 ఆధార్ సూపర్ వైజర్/ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల్లో TGలో11, APలో 4 ఉన్నాయి. పోస్టును బట్టి టెన్త్+ITI, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులై, కంప్యూటర్ స్కిల్స్‌తో పాటు పని అనుభవం గల అభ్యర్థులు జనవరి 31 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. వెబ్‌సైట్: https://cscspv.in * మరిన్ని ఉద్యోగాలకు <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.


