News April 1, 2025

విద్యార్థినులను దుర్భాషలాడిన ప్రిన్సిపల్.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్

image

TG: వికారాబాద్‌లో ఓ ప్రిన్సిపల్ గురుకుల విద్యార్థినులను అసభ్య పదజాలం వాడుతూ కొట్టడంపై <>BRS నేత ప్రవీణ్ కుమార్<<>> తీవ్రంగా స్పందించారు. ‘గురుకులాల్లో పిల్లలను ఇలాగే పెంచుతారా?. విద్యార్థినులను లేకి ము**, దొంగ ము** అని తిడతారా? మీ పిల్లలను ఇలాగే దండిస్తారా?’ అని నిలదీశారు. పిల్లలు తప్పు చేస్తే వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు. ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌ను కోరారు.

Similar News

News February 7, 2026

రుషులు, మునులు, యోగులు, సాధువులు, సన్యాసులు.. వీరంతా ఒకటేనా?

image

వేద మంత్రాలను, విశ్వ సత్యాలను దర్శించిన పరిశోధకులు ‘రుషులు’. వీరు తపస్సుతో రాజర్షి, మహర్షి, బ్రహ్మర్షి, దేవర్షులవుతారు. మౌనమే ఆయుధంగా నిరంతరం ధ్యానంలో నిమగ్నమయ్యే ‘మునులు’. యోగాభ్యాసంతో మనస్సు, శరీరాన్ని నియంత్రించి దైవంతో ఐక్యత సాధించేవారు ‘యోగులు’. ప్రాపంచిక కోరికలనొదిలి భక్తి మార్గంలో సమాజ సేవ చేసేవారు ‘సాధువులు’. సర్వస్వం త్యజించి, భిక్షాటన చేస్తూ కేవలం మోక్షం కోసమే తపించేవారు ‘సన్యాసులు’.

News February 7, 2026

IRCON ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు

image

IRCON ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో 26 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి FEB 10 ఆఖరు తేదీ. బీఈ/బీటెక్, డిప్లొమా అర్హత గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థులు ముందుగా www.mhrdnats.gov.inలో ఎన్‌రోల్ చేసుకోవాలి. దరఖాస్తు కాపీ, డాక్యుమెంట్స్‌ను ఫిబ్రవరి 17వరకు పోస్ట్ చేయాలి. గ్రాడ్యుయేట్లకు నెలకు స్టైపెండ్ రూ. 10వేలు, డిప్లొమా హోల్డర్లకు రూ.8,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://erec.ircon.co.in/

News February 7, 2026

గులాబీలో చీడల నివారణకు సూచనలు

image

చీడలు ఆశించిన గులాబీ రెమ్మలను కత్తిరించి నాశనం చేయాలి. చీడల నివారణకు లీటరు నీటికి 2.5ml క్లోరిపైరిఫాస్, 2ml ప్రొఫినోపాస్ పురుగు మందుల్లో ఒకదానిని.. 3గ్రా బ్లైటాక్స్, 2గ్రా కవచ్‌ మందుల్లో ఒకదానికి కలిపి స్ప్రే చేయాలి. అవసరం బట్టి 2 వారాల వ్యవధిలో మందులు మార్చి స్ప్రే చేయాలి. పువ్వుల నాణ్యత కోసం లీటరు నీటికి 5 గ్రా. మల్టీ-K (13-0-45), 2 గ్రా ఫార్ములా-4ను 15 రోజుల వ్యవధిలో 2,3 సార్లు స్ప్రే చేయాలి.