News February 14, 2025

మహిళా జడ్జిపై చెప్పుతో దాడి చేసిన ఖైదీ

image

TG: కోర్టులో మహిళా జడ్జిపై చెప్పుతో దాడి చేశాడో ఖైదీ. సర్దార్ చీమకొర్తి(22) 2023లో HYD శివారు నార్సింగి ORR సమీపంలో దారి దోపిడీకి పాల్పడి ఒకరిని హత్య చేశాడు. అతడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లగా పోలీసులపై తల్వార్‌తో దాడి చేశాడు. ఈ కేసులో RR కోర్టు జడ్జి అతడికి జీవితఖైదు విధించారు. మరో కేసు విచారణ కోసం నిన్న కోర్టులో హాజరుపర్చగా జడ్జిపై చెప్పు విసిరాడు. దీంతో అక్కడే ఉన్న లాయర్లు అతడిని చితకబాదారు.

Similar News

News December 16, 2025

గతంలో ఎన్నడూ లేనంత పురోగతి: ట్రంప్

image

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని US అధ్యక్షుడు ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతి ఒప్పందం విషయంలో గతంలో ఎన్నడూ లేని పురోగతి సాధించినట్లు చెప్పారు. ఇరుదేశాల శాంతికి US చేస్తున్న ప్రయత్నాలకు జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, యూకే తదితర యూరోపియన్ దేశాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నట్లు తెలిపారు. బెర్లిన్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో యూరోపియన్ నేతలు చర్చల వేళ ట్రంప్ పైవ్యాఖ్యలు చేశారు.

News December 16, 2025

ఎక్కడ మేసినా పేడ మన పెరట్లోనే వెయ్యాలి

image

పశువులు పగలంతా బయట ఎక్కడ మేత మేసినా, సాయంత్రానికి తిరిగి తమ యజమాని ఇంటికే చేరుకుంటాయి. అవి వేసే పేడ యజమాని పెరట్లోనే పడుతుంది. అది ఎరువుగా ఉపయోగపడుతుంది. అలాగే ఒక వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ తిరిగినా, ఎంత పేరు ప్రఖ్యాతలు, డబ్బు సంపాదించినా ఆ లాభం చివరికి తన సొంత ఇంటికి, తన కుటుంబానికి లేదా తన ఊరికే ఉపయోగపడాలని ఈ సామెత చెబుతుంది.

News December 16, 2025

ధనుర్మాసం: తొలిరోజు కీర్తన

image

‘‘సుసంపన్నమైన గోకులంలో పుట్టిన సుశోభిత గోపికల్లారా! అత్యంత విశిష్టమైన మార్గశిరం ఆరంభమైంది. ఈ కాలం వెన్నెల మల్లెపూలలా ప్రకాశిస్తోంది. శూరుడైన నందగోపుని కుమారుడు, విశాల నేత్రాలు గల యశోద పుత్రుడు, నల్లని మేఘసమాన దేహుడు, చంద్రుడిలా ఆహ్లాదకరుడు, సూర్యుడిలా తేజోమయుడైన నారాయణుడి వ్రతం ఆచరించడానికి సిద్ధం కండి. పుణ్య మార్గళి స్నానమాచరించేందుకు రండి’’ అంటూ గోదాదేవి గొల్లభామలందరినీ ఆహ్వానిస్తోంది.