News April 13, 2024
చర్లపల్లి జైల్లో డ్రగ్స్ కోసం ఖైదీల ఆందోళన
TG: తమకు డ్రగ్స్ కావాలంటూ హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలు ఖైదీలు ఆందోళన చేపట్టారు. డ్రగ్స్‌కు అలవాటు పడిన విచారణ ఖైదీలు అక్కడి సిబ్బందిపై తిరగబడ్డారు. దీంతో జైలు అధికారులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ ప్రత్యేక బ్యారక్‌లోకి తరలించినట్లు తెలుస్తోంది. దీనిపై జైలు ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.
Similar News
News November 16, 2024
మా గెలుపు చిన్నదేం కాదు: జైశంకర్
ప్రజాస్వామ్య దేశాల్లో వరుసగా మూడోసారి గెలవడం చిన్న విషయం కాదని EAM జైశంకర్ అన్నారు. ‘చాలా దేశాల్లో రాజకీయ అనిశ్చితి నెలకొన్న టైమ్‌లో భారత్‌లో రాజకీయ స్థిరత్వాన్ని ప్రపంచం గమనిస్తోంది. మనలా 7-8% గ్రోత్‌రేట్ మెయింటేన్ చేయడం వారికి సవాల్‌గా మారింది’ అన్నారు. డొనాల్డ్ ట్రంప్ విజయం పైనా ఆయన స్పందించారు. US ఎన్నికలు గ్లోబలైజేషన్‌పై అసంతృప్తిని ప్రతిబింబించాయని, దానివల్ల చైనాకే లబ్ధి కలిగిందని చెప్పారు.
News November 16, 2024
ధనుష్.. మీకు తగిన విధంగా బదులిస్తాం: నయనతార
‘నానుమ్ రౌడీ దాన్’ షూట్ సమయంలో ఫోన్లలో తీసుకున్న క్లిప్స్‌కు కూడా ధనుష్ పరిహారం అడుగుతున్నారని నయనతార ఆవేదన వ్యక్తం చేశారు. ‘ధనుష్.. మీరు నిర్మాత అయినంత మాత్రాన మా జీవితాల్ని నియంత్రిస్తారా? మీ నోటీసులకు చట్టప్రకారం తగిన విధంగా జవాబిస్తాం. ఆ మూవీ వచ్చి పదేళ్లైనా మీరు ఇంకా మాపై విషం కక్కుతున్నారు. ఆడియో వేడుకల్లో నటించే వ్యక్తిత్వాన్ని మీ నిజజీవితంలో కనీసం సగమైనా అనుసరించండి’ అని పేర్కొన్నారు.
News November 16, 2024
ఒకేసారి ఓలా, ర్యాపిడోలో రైడ్ బుకింగ్.. చిక్కులు తెస్తున్న కొత్త ట్రెండ్
నగరాల్లో ఓ కొత్త ట్రెండ్ ఆటోడ్రైవర్లకు ఇబ్బందిగా మారినట్టు తెలుస్తోంది. కొందరు కస్టమర్లు ఓలా, ర్యాపిడో రెండిట్లోనూ రైడ్ బుక్‌చేస్తున్నారట. తక్కువ ఛార్జ్ లేదా త్వరగా వచ్చిన ఆటో ఎక్కేసి వెళ్తున్నారని సమాచారం. దీంతో తమకు టైమ్, పెట్రోల్ వేస్ట్ అవుతోందని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. బిజీటైమ్‌లో తక్కువ దూరానికి వాళ్లు వేసే ఛార్జీల దెబ్బకు ఇలా చేయడంలో తప్పేముందని కస్టమర్ల వాదన. దీనికి పరిష్కారం ఏంటంటారు?