News December 7, 2024

పృథ్వీ షా తల్లి లేని బిడ్డ: మాజీ కోచ్

image

క్రికెటర్ పృథ్వీ షాపై విమర్శలు అన్యాయమని అతడి చిన్ననాటి కోచ్ రాజు పాఠక్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘వారిది చాలా పేద కుటుంబం. పృథ్వీ చాలా కష్టపడ్డాడు. మంచీచెడూ చెప్పేందుకు తల్లి లేదు. చిన్నతనంలోనే అమ్మ ప్రేమకు దూరమయ్యాడు. రోజు ఎలా గడవాలన్న స్థితి నుంచి ఒక్కసారిగా డబ్బు వచ్చిపడటంతో లైఫ్‌ను ఎంజాయ్ చేశాడు. కానీ పాతికేళ్ల కుర్రాడు 40 ఏళ్లవాడిలా ప్రవర్తించాలని అందరూ కోరుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News February 5, 2025

విజయ్‌లో నాకు నచ్చనిది అదే: త్రిష

image

దళపతి విజయ్ షూటింగ్‌లో ఒక గోడ పక్కన మౌనంగా కూర్చొని ఉంటారని హీరోయిన్ త్రిష అన్నారు. ఆయనలో తనకు అదే నచ్చదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. విజయ్‌కి అది మార్చుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఏమైనా విజయ్ తనకు ఎప్పుడూ ప్రత్యేకమేనని చెప్పుకొచ్చారు. మరో నటుడు శింబు తనను షూటింగ్ సమయంలో టీజ్ చేస్తారని పేర్కొన్నారు. విజయ్, త్రిష జంటగా లియో, గిల్లితో పాటు పలు చిత్రాల్లో నటించారు.

News February 5, 2025

పంచాయతీ ఎన్నికలకు వారంలో నోటిఫికేషన్?

image

తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలుకానుంది. కులగణన, జనాభా ఆధారంగా వారికి రిజర్వేషన్లు కల్పించే అంశంపై ప్రభుత్వం స్పష్టతకు రావడంతో మరో వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం స్పందించకపోయినా, పార్టీ పరంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని సీఎం రేవంత్ చెప్పారు. దీంతో ఎన్నికల నిర్వహణకు ఎక్కువ టైం పట్టదంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

News February 5, 2025

మేడారంలో ఇవాళ్టి నుంచి శుద్ధి కార్యక్రమాలు

image

TG: ములుగు(D) తాడ్వాయి(మ) మేడారం మినీ జాతరకు సిద్ధమవుతోంది. ఇవాళ్టి నుంచి సమ్మక్క-సారలమ్మకు పూజలు ప్రారంభం కానున్నాయి. కన్నెపల్లిలో సారలమ్మ, మేడారంలోని సమ్మక్క ఆలయాల్లో అర్చకులు శుద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయాల్లోని పూజా సామగ్రిని శుద్ధి చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. దేవతల పీటలను శుభ్రం చేసి, ముగ్గులతో సుందరంగా అలంకరిస్తారు. ఈ నెల 12 నుంచి 15 వరకు మినీ జాతర వేడుకలు నిర్వహిస్తారు.

error: Content is protected !!