News December 20, 2024
పృథ్వీషాకు తనకు తానే శత్రువు: MCA

టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీషాకు శత్రువులెవరూ లేరని, తనకు తానే శత్రువని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) విమర్శించింది. ఫిట్నెస్, క్రమశిక్షణ, ఆటిట్యూడ్‌లో సమస్యలే ఇందుకు కారణమని తెలిపింది. ‘SMATలో పృథ్వీ షా జట్టులో ఉన్నా లేనట్లే. ఫీల్డింగ్‌లో దగ్గరికి వచ్చిన బంతిని కూడా ఆయన అందుకోలేకపోయారు. బ్యాటింగ్‌లోనూ ఏమాత్రం రాణించలేదు. జట్టులోని సీనియర్ ఆటగాళ్లు కూడా అతడిపై ఫిర్యాదు చేశారు’ అని పేర్కొంది.
Similar News
News October 30, 2025
పంట నష్టం: నేటి నుంచి ఎన్యూమరేషన్

AP: మొంథా తుఫాను ధాటికి 1.23L హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. 1.38L మంది రైతులు నష్టపోయినట్లు గుర్తించారు. నేటి నుంచి క్షేత్రస్థాయిలో ఎన్యూమరేషన్(లెక్కింపు) నిర్వహించనున్నట్లు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో 4,576KM మేర రోడ్లు, 302చోట్ల కల్వర్టులు, వంతెనలు ధ్వంసమైనట్లు నిర్ధారించారు. వీటికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని మంత్రి జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
News October 30, 2025
కందిలో పచ్చదోమ – నివారణకు సూచనలు

వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉన్నపుడు కందిలో పచ్చదోమ ఉద్ధృతి పెరుగుతుంది. పచ్చదోమ పురుగులు కంది ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. దీంతో ఆకులు పసుపుపచ్చగా మారి ముడుచుకొని దోనె లాగా కనిపిస్తాయి. తీవ్రత పెరిగితే ఆకులు ఎర్రబడి రాలిపోయి.. మొక్కల ఎదుగుదల, దిగుబడి తగ్గుతుంది. పచ్చదోమ నివారణకు లీటరు నీటికి మోనోక్రోటోఫాస్ 36% S.L 1.6ml లేదా డైమిథోయేట్ 30%E.C 2.2ml కలిపి పిచికారీ చేయాలి.
News October 30, 2025
నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్

* ఆధార్‌లో పేరు, అడ్రస్, DOB, మొబైల్ నంబర్‌ను ఇంటి నుంచే అప్డేట్ చేసుకోవచ్చు. ఇందుకు ₹75 ఛార్జీ చెల్లించాలి. అయితే బయోమెట్రిక్ అప్డేట్ కోసం ఆధార్ కేంద్రానికి వెళ్లాలి. ఇందుకు ₹125 వసూలు చేస్తారు.
* బ్యాంక్ అకౌంట్స్, లాకర్స్, సేఫ్ కస్టడీ కోసం ఇకపై నలుగురు నామినీలను పెట్టుకోవచ్చు.
* SBI: థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఎడ్యుకేషన్ పేమెంట్లకు, రూ.1,000పైన వ్యాలెట్ రీఛార్జ్‌కు 1 శాతం ఫీజు వర్తిస్తుంది.


