News October 8, 2025

పృథ్వీ.. ఎందుకీ పరే’షా’న్!

image

పృథ్వీ షాకు టాలెంట్ ఉన్నా డిసిప్లేన్ లేదని, కాంట్రవర్సీలతో కెరీర్ నాశనం చేసుకుంటున్నాడన్న పేరుంది. ఫిట్‌నెస్, ఫామ్ లేమితో IND జట్టుకు దూరమైన షా.. ఇటీవల దేశవాళీ టోర్నీల్లో రాణిస్తున్నాడు. ఇంతలోనే <<17943633>>మరో గొడవతో<<>> వార్తల్లోకెక్కాడు. 2018 U19 WC గెలిచిన జట్టుకు కెప్టెన్‌గా ఉన్న షా, ఆ స్థాయికి తగ్గట్లుగా కెరీర్‌ను మలుచుకోలేకపోయాడని, అప్పుడు VCగా ఉన్న గిల్ ఇప్పుడు కెప్టెన్ అయిపోయాడని నెటిజన్లు అంటున్నారు.

Similar News

News October 8, 2025

EPFO కనీస పింఛన్ రూ.2,500కు పెంపు?

image

ఈపీఎఫ్‌వో చందాదారులకు కనీస పింఛన్ రూ.2,500కు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 10, 11న ట్రస్టీల భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పింఛను పెంపుపై నిర్ణయం తీసుకుంటే కేంద్రం ఆమోదించాల్సి ఉంటుంది. మరోవైపు రూ.7,500 ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం నెలకు రూ.1,000 పింఛన్ అందుతోంది. 10 ఏళ్ల రెగ్యులర్ సర్వీసు, 58 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు ఇందుకు అర్హులు.

News October 8, 2025

దయచేసి మాకు పోటీగా రాకండి: గ్రూప్-3 ర్యాంకర్లు

image

TG: గ్రూప్-2 ఉద్యోగానికి ఎంపికైన వారు తమకు పోటీగా రావొద్దని గ్రూప్-3కి క్వాలిఫై అయిన ర్యాంకర్లు కోరారు. వెబ్ ఆప్షన్, సర్టిఫికెట్ల పరిశీలనకు దూరంగా ఉండాలని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వేడుకున్నారు. గ్రూప్3 పోస్టులకు ఎంపికైన గ్రూప్2 అభ్యర్థులు 500 మంది ఉన్నారని, అధ్యాపకులు, SIలు మరో 600 మంది ఉన్నారని తెలిపారు. వీరు కోర్టు కేసుల నేపథ్యంలో గ్రూప్3 పోస్టులను బ్యాకప్ ఆప్షన్‌గా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

News October 8, 2025

రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఇలా చేయండి!

image

ఉదయం మీరు చేసే చిన్న పనులు రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. తేలికపాటి వ్యాయామం రక్తప్రసరణను, శక్తిని పెంచుతుంది. మానసిక స్థితి మెరుగవుతుంది. ఉదయం నీరు తాగితే శరీరం తక్షణమే హైడ్రేట్ అవడంతో పాటు జీవక్రియ మెరుగవుతుంది. అంతేకాక ప్రొటీన్లు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు ఉన్న సమతుల్య అల్పాహారం తీసుకుంటే రోజంతా శక్తి అందుతుంది. కొద్దిసేపు సూర్యరశ్మిలో ఉంటే చురుకుదనం పెరుగుతుంది.