News April 28, 2024
పాంటింగ్‌పై పృథ్వీషా ఆగ్రహం.. అదే కారణమా?

ఈరోజు మధ్యాహ్నం ఢిల్లీ, ముంబై మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ తమ ఓపెనర్ పృథ్వీషాను పక్కన పెట్టిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ప్రారంభానికి ముందు తమ కోచ్ పాంటింగ్‌తో షా తీవ్ర ఆగ్రహంతో మాట్లాడటం కనిపించింది. ఇది నెట్టింట విస్తృత చర్చకు దారి తీసింది. బహుశా జట్టులో లేడని పాంటింగ్ చెప్పడంతో షా ఆగ్రహానికి గురై ఉండొచ్చంటూ చర్చించుకుంటున్నారు. షా ఈ సీజన్లో ఇప్పటి వరకు కేవలం 185 పరుగులు మాత్రమే చేశారు.
Similar News
News December 15, 2025
ఇవాళ కన్హా శాంతివనానికి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ శంషాబాద్‌లోని కన్హా శాంతివనాన్ని సందర్శించనున్నారు. ఉదయం 11గంటలకు జూబ్లీహిల్స్ నుంచి బయలుదేరి శాంతి వనం అధ్యక్షుడితో భేటీ కానున్నారు. తర్వాత యోగా, వెల్నెస్ సెంటర్లను పరిశీలించనున్నారు. అనంతరం అమరావతికి బయలుదేరుతారు. సాయంత్రం విజయవాడలో జరిగే పొట్టిశ్రీరాములు ఆత్మార్పణదినం కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. కాగా కన్హా శాంతివనం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానకేంద్రాలలో ఒకటిగా ఉంది.
News December 15, 2025
దురదృష్టం.. ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ చేసినా

TG: సూర్యాపేటలోని గుడిబండ గ్రామంలో ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసిన వెంకటేశ్వర్లుకు దురదృష్టం వెంటాడింది. కేవలం పది ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మంత్రి ఉత్తమ్, ఆయన సతీమణి పద్మావతి వ్యక్తిగతంగా మద్దతు తెలిపినా వెంకటేశ్వర్లుకు పరాజయం తప్పలేదు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి నాగయ్య చేతిలో ఓడారు. వెంకటేశ్వర్లు పదవీకాలం మరో 5 నెలల్లో ముగియనుండగా VRS తీసుకొని పోటీ చేశారు.
News December 15, 2025
చిరంజీవికి ఆ లుక్ వద్దని చెప్పా: అనిల్ రావిపూడి

‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా కోసం చిరంజీవి ‘సాల్ట్ అండ్ పెప్పర్’ లుక్ ప్రయత్నిస్తానన్నారని, తానే వద్దని చెప్పినట్లు దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. బయట ఎలా ఉన్నారో సినిమాలో అలానే చూపిస్తానని చెప్పానని అనిల్ అన్నారు. కాగా ఈ మూవీలో వెంకీ-చిరు కాంబినేషన్లో 20 నిమిషాల సీన్స్ ఉంటాయని చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుండగా, ఇప్పటికే వెంకీ రోల్ షూటింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే.


