News October 26, 2025

నవంబర్ 3 నుంచి ప్రైవేట్ కాలేజీల బంద్

image

TG: రాష్ట్రంలో నవంబర్ 3 నుంచి ప్రైవేట్ కాలేజీల బంద్ చేపట్టాలని ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య మీటింగ్‌లో నిర్ణయించారు. NOV 1లోపు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని లేకపోతే నిరవధిక బంద్ చేపడతామని ఆ సమాఖ్య ఛైర్మన్ రమేశ్ బాబు ప్రకటించారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే రోజుకో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. అటు HYDలో లెక్చరర్లతో భారీ బహిరంగ సభ, 10లక్షల మంది విద్యార్థులతో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.

Similar News

News October 26, 2025

గెలిస్తే వక్ఫ్ బిల్లును చెత్తబుట్టలో పడేస్తాం: తేజస్వీ

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండీ కూటమి గెలిస్తే వక్ఫ్ బిల్లును చెత్తబుట్టలో పడేస్తామని CM అభ్యర్థి, RJD నేత తేజస్వీ యాదవ్ హామీ ఇచ్చారు. ‘‘నా తండ్రి, RJD చీఫ్ లాలూ ప్రసాద్ దేశంలో మతతత్వ శక్తుల విషయంలో ఎప్పటికీ కాంప్రమైజ్ కారు. కానీ సీఎం నితీశ్ కుమార్ ఎప్పుడూ వారికి మద్దతిస్తారు. ఆయన వల్లే RSS రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడుతోంది. BJPని ‘భారత్ జలావో పార్టీ’ అని పిలవాలి’’ అంటూ వ్యాఖ్యానించారు.

News October 26, 2025

అల్పపీడనం, వాయుగుండం అంటే?

image

సముద్రంపై ఉండే వేడి గాలులు నీటి బిందువులను ఆవిరిగా మార్చి తక్కువ పీడనం ఉన్న వైపునకు పయనిస్తాయి. దీన్ని అల్పపీడన ద్రోణి అని అంటారు. ఈ ద్రోణి నీటి బిందువులను ఆకర్షిస్తూ అల్పపీడనంగా మారుతుంది. ఇది బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి తీరం వైపు వస్తుంది. ఆపై వాయుగుండం(31-50Kmph గాలులు)గా, మరింత బలపడితే తీవ్ర వాయుగుండం(51-62kmph గాలులు)గా ఛేంజ్ అవుతుంది. గాలుల వేగం 62Kmph దాటితే తుఫానుగా పరిగణిస్తారు.

News October 26, 2025

స్టార్ క్యాంపెయినర్స్‌గా సోనియా, రాహుల్, ప్రియాంక

image

బిహార్ ఫస్ట్ ఫేజ్ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ 40 మందితో స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్‌ రిలీజ్ చేసింది. ఇందులో పార్టీ చీఫ్ ఖర్గేతో పాటు అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా ఉన్నారు. పార్టీ జనరల్ సెక్రటరీలు KC వేణుగోపాల్, భూపేశ్ బఘేల్, సచిన్ పైలట్, రణ్‌దీప్ సుర్జేవాలా, సయ్యద్ నాసిర్ హుస్సేన్ తదితరుల పేర్లనూ చేర్చింది. NOV 6, 11 తేదీల్లో 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.