News March 27, 2025
ప్రైవేట్ వీడియో లీక్.. నటి ఇన్స్టా పోస్ట్ చూశారా?

తమిళ <<15899290>>నటి ప్రైవేట్ వీడియో<<>> అంటూ SMలో జరుగుతున్న ప్రచారంపై శృతి నారాయణన్ ఇన్స్టా వేదికగా చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. చూడటానికి ఒకేలా ఉన్న ఓ అమ్మాయి AI వీడియోను షేర్ చేశారు. ఇందులో ఎవరు నిజమైన మనిషో చెప్పాలని అందులోని యువతి ప్రశ్నిస్తోంది. AIతో ఇలా చేయొచ్చని శృతి పరోక్షంగా తెలిపారు. దీంతో ఆ నటిపై జరుగుతున్నది తప్పుడు ప్రచారం అయ్యుండొచ్చని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.
Similar News
News December 3, 2025
HNK: ఎవరు పోశారు అబ్బా..!

HNKలో మూడు రోజుల క్రితం <<18442662>>నర్సింగ్ విద్యార్థినిపై రసాయనిక దాడి<<>> జరిగిన విషయం తెలిసిందే. కడిపికొండలో స్కూటీపై వెళ్తుండగా విద్యార్థినిపై దాడి జరిగిందని పోలీసులు భావించారు. విచారణలో దాడి చేసిన వాళ్లు ఎవరో తెలియక తల పట్టుకున్నారు. విద్యార్థిని కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. దాడి జరిగిన సమయంలో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. దాడి ఎలా జరిగింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News December 3, 2025
IPL-2026: వీరిలో ఎవరిని మిస్ అవుతారు?

ఫారిన్ ప్లేయర్లు రసెల్, డుప్లెసిస్ IPLకు రిటైర్మెంట్ ప్రకటించగా మరో ప్లేయర్ మ్యాక్స్వెల్ వచ్చే సీజన్కు అందుబాటులో ఉండట్లేదని అనౌన్స్ చేశారు. తమదైన ఆటతో మ్యాచు స్వరూపాన్నే మార్చేయడంలో వీరు దిట్ట. స్థిరత్వానికి డుప్లెసిస్ మారుపేరు కాగా, ఆల్రౌండర్ కోటాలో మ్యాక్సీ, రసెల్ రాణించిన సందర్భాలు చాలా ఉన్నాయి. వీరి స్థానాలను ఇప్పటికిప్పుడు భర్తీ చేయడం కష్టమే. మీరు వీరిలో ఎవరి ఆట మిస్ అవుతారు? కామెంట్.
News December 3, 2025
పిల్లల జీవితానికి ఈ అలవాట్లే పునాదులు

చిన్నతనంలోనే పిల్లలకు కొన్ని అలవాట్లు నేర్పిస్తే వారిలో ప్రశాంతతతోపాటు క్రమశిక్షణ, ఏకాగ్రత, జీవన నైపుణ్యాలు మెరుగవుతాయంటున్నారు నిపుణులు. ఉదయాన్నే త్వరగా నిద్ర లేవడం, బెడ్ సర్దడం, తమంతట తామే రెడీ కావడం, వ్యాయామం, క్లీనింగ్, గార్డెనింగ్ చేయించడం వల్ల వారిలో ఉత్పాదకత పెరుగుతుందని చెబుతున్నారు. వీటితో పాటు పుస్తకాలు చదవడం, కృతజ్ఞతాభావం అలవాటు చేయడం వారికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడతాయంటున్నారు.


