News November 23, 2024

ప్రియాంక @ 54,000+ మెజార్టీ..

image

వయనాడ్‌లో ప్రియాంకా గాంధీ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆమె 54 వేలకు పైగా మెజార్టీ సాధించారు. సీపీఎం, బీజేపీ అభ్యర్థులు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న గాంధీ కుటుంబీకురాలికి 5 లక్షలకు పైగా మెజార్టీ వస్తుందని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు.

Similar News

News December 5, 2025

పార్వతీపురం: విద్యార్థులు నా ఆలోచనకు దగ్గరుండాలి.. సీఎం

image

భామిని ఆదర్శ పాఠశాలలో జరుగుతున్న మెగా PTM కార్యక్రమంలో CM చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారు చేసి, ప్రదర్శించిన 3D ప్రింటర్‌ను సీఎం ఆసక్తిగా తిలకించారు. సాంకేతికతతో తయారు చేసిన 3D ప్రింటర్‌ ఉపయోగాలను విద్యార్థులు సీఎంకు వివరించారు. నా ఆలోచనకు మీరు దగ్గరుండాలని విద్యార్థులకు సీఎం సూచించారు. విద్యార్థులను అభినందించారు.

News December 5, 2025

ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి

image

TG: వచ్చే మూడేళ్లలో అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. తొలి విడతలో 4 లక్షల ఇళ్లను మంజూరు చేశామని, వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తామన్నారు. ఏప్రిల్ నుంచి రెండో విడత ఇళ్ల పంపిణీని ప్రారంభిస్తామని ప్రకటించారు. ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, అర్హులందరికీ ఇస్తామని తెలిపారు.

News December 5, 2025

‘పుష్ప-2’కు ఏడాది.. అల్లుఅర్జున్ స్పెషల్ ట్వీట్

image

‘పుష్ప2’ విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. ప్రేక్షకుల నుంచి లభించిన అపారమైన ప్రేమ తమకు మరింత ధైర్యాన్నిచ్చిందని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చిత్రాన్ని అద్భుతంగా మార్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘కెప్టెన్’ సుకుమార్ సహా చిత్రబృందానికి ధన్యవాదాలు చెప్పారు. ‘పుష్ప’గా ఈ 5ఐదేళ్ల ప్రయాణం తన జీవితంలో మరువలేనిదని కొనియాడారు.