News November 23, 2024
రాహుల్‌ను బీట్ చేసిన ప్రియాంక
తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ప్రియాంకా గాంధీ భారీ మెజార్టీతో విజయం దిశగా దూసుకెళ్తున్నారు. వయనాడ్ పార్లమెంట్ ఉపఎన్నిక ఫలితాల్లో ప్రస్తుతం ఆమె 4 లక్షల మెజార్టీ వైపు కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఇక్కడ 3.64 లక్షల మెజార్టీ సాధించగా ఇప్పుడు ఆమె తన సోదరుడి మెజార్టీని బీట్ చేశారు. ప్రియాంకకు 5 లక్షల మెజార్టీ వస్తుందని కాంగ్రెస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
Similar News
News November 27, 2024
చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టుపై స్పందించిన బంగ్లాదేశ్
ఇస్కాన్ గురువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్‌పై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ స్పందించింది. ఆయన్ను ప్రత్యేక పరిస్థితుల్లో అరెస్ట్ చేశామంది. దేశ న్యాయశాఖకు పూర్తి స్వేచ్ఛ ఉందని, ఆ విషయంలో జోక్యం చేసుకోబోమని తెలిపింది. తాము మైనార్టీల హక్కులకు రక్షణ కల్పిస్తామంది. మతపరమైన హింసను ప్రోత్సహించబోమని, చిన్మయ్ అరెస్టైన వేళ జరిగిన అల్లర్లలో అడ్వకేట్ సైఫుల్ ఇస్లాం హత్యను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పింది.
News November 27, 2024
అఖిల్‌కు కాబోయే భార్య వయసు ఎంతంటే?
అక్కినేని అఖిల్ (30) తన ప్రేయసి జైనబ్ రవ్‌డ్జీతో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అఖిల్ కంటే వయసులో జైనబ్ 9 ఏళ్లు పెద్ద అని పలు కథనాలు పేర్కొన్నాయి. మూవీ కోసం గుర్రపు స్వారీ నేర్చుకునే క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు సమాచారం. అయితే జైనబ్ వయసు 27 ఏళ్లేనని మరి కొన్ని కథనాలు తెలిపాయి. ఏది ఏమైనా ప్రేమకు వయసు అడ్డు కాదని ఇద్దరి మనసులు కలవడం ముఖ్యమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
News November 27, 2024
కోస్తాంధ్రకు ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక
AP: దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇవాళ తుఫానుగా రూపాంతరం చెందుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది. కోస్తాంధ్రలో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. తీర ప్రాంతాల్లో 35-55KMS వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, దక్షిణ కోస్తాలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది.