News November 23, 2024
రాహుల్ రికార్డును బ్రేక్ చేసిన ప్రియాంక.. మెజారిటీ 4,10,931
వయనాడ్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ భారీ విజయాన్ని నమోదు చేశారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ సాధించిన 3.60 లక్షల మెజారిటీ రికార్డును బ్రేక్ చేసి 4,10,931 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఎల్డీఎఫ్ అభ్యర్థి సత్యన్ మోకెరీ రెండో స్థానానికి, బీజేపీ అభ్యర్థి నవ్యా హరిదాస్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. విజయం సాధించిన అనంతరం కలిసిన ప్రియాంకకు ఖర్గే శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News November 23, 2024
గంభీర్ నాకు ఇచ్చిన సలహా అదే: హర్షిత్ రాణా
తన టెస్టు కెరీర్కు మంచి ఆరంభం లభించడం వెనుక కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన సలహాలున్నాయని భారత పేసర్ హర్షిత్ రాణా తెలిపారు. ఆయన తనకు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. ‘ఆటగాళ్లకు ఎప్పుడూ అండగా నిలిచే వ్యక్తి గంభీర్. ఓపికతో ఉండాలన్నదే ఆయన నాకు ఇచ్చిన సలహా. దేశానికి ఆడే అవకాశం వచ్చాక భారత ప్రజల్ని గుర్తుపెట్టుకుని సర్వశక్తులూ ఒడ్డి ఆడాలని సూచించారు. అదే చేస్తున్నా’ అని తెలిపారు.
News November 23, 2024
వారికి AR రెహమాన్ లీగల్ నోటీసులు
తనపై అవాస్తవాలు ప్రచారం చేసేవారిపై AR రెహమాన్ చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. భార్య సైరా బానుతో విడిపోతున్నట్లు ఆయన ప్రకటించగా, ఆ విషయంపై రూమర్స్ వచ్చాయి. అర్థరహిత సమాచారం వ్యాప్తి చేసేవారికి లీగల్ నోటీసులు పంపాలని రెహమాన్ చెప్పినట్లు ఆయన లీగల్ టీమ్ పేర్కొంది. యూట్యూబ్, ఎక్స్, ఇన్స్టా, ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నుంచి అభ్యంతరకర కంటెంట్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది.
News November 23, 2024
ఆ ఇద్దరే అసలైన వారసులా?
MHలో Political Equations మారిపోయాయి. NCP, శివసేనలో వచ్చిన చీలికలపై ప్రజలు తీర్పు చెప్పేశారు. 51 సీట్లలో శివసేన షిండే-ఉద్ధవ్ వర్గాలు, 37 చోట్ల NCP అజిత్-శరద్ పవార్ వర్గాలు పోటీపడ్డాయి. మొత్తంగా 81 స్థానాల్లో పోటీ చేసిన శిండే వర్గం 57 చోట్ల, అజిత్ వర్గం 59 సీట్లకు 41 చోట్ల సత్తాచూపాయి. 95 సీట్లలో పోటీ చేసిన ఉద్ధవ్ వర్గం 20 చోట్ల, పవార్ వర్గం 86కు 10 చోట్ల విజయం సాధించాయి.