News March 20, 2024
అయోధ్య రామయ్య సేవలో ప్రియాంక చోప్రా

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా అయోధ్యలో బాలరాముడిని దర్శించుకున్నారు. భర్త నిక్ జోనాస్, కుమార్తె మాల్టీ మేరీ జోనాస్తో కలిసి బాలరామయ్య సేవలో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రామజన్మభూమిలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఆమె తొలిసారి దర్శించుకున్నారు.
Similar News
News November 27, 2025
నేడే మెగా వేలం

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) మెగా ఆక్షన్ నేడు ఢిల్లీలో జరగనుంది. 277 మంది అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇందులో 194 మంది భారత ప్లేయర్లు ఉన్నారు. మహిళల వరల్డ్ కప్లో రాణించిన దీప్తీ శర్మ, రేణుక, వోల్వార్ట్ తదితరులు భారీ ధర దక్కించుకునే ఛాన్స్ ఉంది. ఇవాళ వేలంలోకి వచ్చే క్రికెటర్లలో దియా యాదవ్(16), భారతి సింగ్(16) తక్కువ వయస్సుగల వారు కాగా, SA ప్లేయర్ షబ్నిమ్(37)ఓల్డెస్ట్ క్రికెటర్.
News November 27, 2025
దారిద్ర్యాన్ని తొలగించే దక్షిణామూర్తి స్తోత్రం మహిమ

ఓం యో బ్రహ్మాణం విదధాతి పూర్వం
యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై|
తంహదేవమాత్మ బుద్ధిప్రకాశం
ముముక్షుర్వై శరణమహం ప్రపద్యే||
దక్షిణామూర్తి స్తోత్రం అత్యంత విశిష్టమైనది. ఈ స్తోత్రం గురు శిష్యుల గొప్పతనాన్ని వివరిస్తుంది. ఆత్మజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. దక్షిణామూర్తి ఇతర స్తోత్రాలు, శ్లోకాలు, మంత్రాలు కూడా జ్ఞాన సాధన కోసం చాలా ముఖ్యమని ఆదిశంకరాచార్యులు చెప్పినట్లు చాగంటి కోటేశ్వరరావు తెలిపారు.
News November 27, 2025
11,639 ఉద్యోగాల భర్తీ.. హైకోర్టు కీలక ఉత్తర్వులు

AP: పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 11,639 ఉద్యోగాల భర్తీపై 6 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు CS, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ విచారణను 6 వారాలకు వాయిదా వేసింది. పోలీస్ శాఖలో 19,999 ఖాళీలున్నాయని RTI ద్వారా ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని, వీటి భర్తీకి ఆదేశాలివ్వాలంటూ ఓ ట్రస్టు పిల్ వేసింది. వీటిలో 11,639 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.


