News May 22, 2024
ప్రియాంకా చోప్రా నెక్లెస్ రూ.358 కోట్లు
రోమ్‌లో బుల్గారీ 140వ వార్షికోత్సవ ఈవెంట్‌కు హాజరైన నటి ప్రియాంకా చోప్రా తన న్యూ లుక్‌తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమంలో ఆమె ధరించిన ఖరీదైన నెక్లెస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. 140 క్యారెట్ల డైమండ్స్‌తో తయారు చేసిన ఆ నెక్లెస్ విలువ దాదాపు రూ.358 కోట్లు ఉంటుందని ఓ రిపోర్ట్ పేర్కొంది. 698 బాగెట్ వజ్రాలను ఉపయోగించి ఆ నెక్లెస్ తయారు చేయడానికి 2,800 గంటల సమయం పట్టినట్లు తెలిపింది.
Similar News
News January 12, 2025
కేజ్రీవాల్‌కు అమిత్ షా కౌంటర్
రమేశ్ బిధూరీని బీజేపీ సీఎంగా అభ్యర్థిగా ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పేర్కొనడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్ ఎటాక్ చేశారు. ‘బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని కేజ్రీవాల్ నిర్ణయిస్తారా? అలాంటి వ్యాఖ్యలు చేసేందుకు ఆయన ఎవరు?’ అని షా ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రమేశ్ ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
News January 12, 2025
80 మంది విద్యార్థినుల చొక్కాలు విప్పించిన ప్రిన్సిపల్
ఝార్ఖండ్‌లో ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. ఓ ప్రిన్సిపల్ 80 మంది విద్యార్థినుల చొక్కాలను విప్పి ఇంటికి పంపారు. ధన్‌బాద్ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూల్లో టెన్త్ పరీక్షలు ముగియడంతో విద్యార్థినులు ‘పెన్ డే’ నిర్వహించారు. ఒకరి చొక్కాలపై మరొకరు సంతకం చేసుకున్నారు. ఇది చూసిన ప్రిన్సిపల్ వారి చొక్కాలను విప్పించారు. బ్లేజర్లతోనే విద్యార్థినులను ఇంటికి పంపారు. దీనిపై పోలీసుల విచారణ జరుగుతోంది.
News January 12, 2025
జనవరి 12: చరిత్రలో ఈ రోజు
1863: తత్వవేత్త స్వామి వివేకానంద జననం
1895: యల్లాప్రగడ సుబ్బారావు జననం
1962: రిచీ రిచర్డ్సన్ జననం
1991: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ జననం
1991: చెస్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక జననం
2005: సినీ నటుడు అమ్రీష్ పురి మరణం
2015: సినీ నిర్మాత, దర్శకుడు వి.బి.రాజేంద్రప్రసాద్ మరణం
* జాతీయ యువజన దినోత్సవం