News November 8, 2024

‘జమాతే’ మద్దతుతో ప్రియాంక పోటీ: విజయన్

image

కాంగ్రెస్ పార్టీపై కేరళ CM విజయన్ తీవ్ర ఆరోపణలు చేశారు. వయనాడ్ బై ఎలక్షన్‌లో ప్రియాంకా గాంధీ వాద్రా నిషేధిత జమాతే ఇస్లామీ మద్దతుతో పోటీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ లౌకిక ముసుగును బట్టబయలు చేసిందన్నారు. జమాతే సిద్ధాంతం మన ప్రజాస్వామ్య విలువలతో సరిపోతుందా? ఈ విషయంలో INC వైఖరేంటి? అని నిలదీశారు. ఈ ఉప ఎన్నికలో సీపీఐ నుంచి సత్యన్, బీజేపీ నుంచి నవ్యా హరిదాస్ పోటీ పడుతున్నారు.

Similar News

News December 7, 2025

న్యాయం చేయండి.. మోదీకి పాక్ మహిళ అభ్యర్థన

image

తనకు న్యాయం చేయాలని ప్రధాని మోదీని పాకిస్థాన్ మహిళ కోరారు. తన భర్త విక్రమ్ నాగ్‌దేవ్ కరాచీ నుంచి లాంగ్ టర్మ్ వీసాపై ఇండోర్‌(MP) వచ్చి అక్కడే ఉంటున్నాడని పేర్కొన్నారు. అతను ఢిల్లీకి చెందిన మరో యువతితో పెళ్లికి సిద్ధమైనట్టు తెలిసిందని చెప్పారు. జనవరిలో కేసు ఫైల్ చేసినా లీగల్‌గా న్యాయం జరగలేదన్నారు. ప్రధాని మోదీ న్యాయం చేయాలంటూ అభ్యర్థించిన వీడియో వైరలవుతోంది. దీనిపై లీగల్ బాడీస్ మండిపడుతున్నాయి.

News December 7, 2025

‘EU’ని రద్దు చేయాలి: ఎలాన్ మస్క్

image

యూరోపియన్ కమిషన్ ‘X’కు 140 మిలియన్ డాలర్ల <<18483215>>ఫైన్<<>> విధించడంపై ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. ‘యూరోపియన్ యూనియన్‌ను రద్దు చేయాలి. సార్వభౌమాధికారాన్ని దేశాలకు తిరిగి ఇవ్వాలి. తద్వారా ప్రభుత్వాలు తమ ప్రజలకు బాగా ప్రాతినిధ్యం వహించగలుగుతాయి’ అని పేర్కొన్నారు. ఈ కామెంట్స్‌ను ఓ యూజర్ షేర్ చేయగా.. ‘నా ఉద్దేశం అదే.. నేను తమాషా చేయట్లేదు’ అని పునరుద్ఘాటించారు.

News December 7, 2025

డిసెంబర్ 07: చరిత్రలో ఈ రోజు

image

1792: భారత్‌లో పోలీసు వ్యవస్థను ప్రవేశపెట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీ
1896: తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు కన్నెగంటి సూర్యనారాయణమూర్తి జననం
1975: డైరెక్టర్ సురేందర్ రెడ్డి జననం
2013: హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం(ఫొటోలో) మరణం
*భారత సాయుధ దళాల పతాక దినోత్సవం
*అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం