News May 25, 2024
ప్రధాని మోదీపై ప్రియాంక ఫైర్

పదవి మర్యాద పాటించాల్సిన అవసరం ప్రధాని మోదీకి లేదా? అని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఫైరయ్యారు. బిహార్ సభలో ప్రధాని మోదీ అభ్యంతరకర <<13314526>>భాష<<>>ను ఉపయోగించారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో మోదీ అసలు స్వరూపం బయటపడిందని, దేశానికి ప్రతినిధి అనే విషయాన్ని ఆయన మరిచిపోతున్నారని ధ్వజమెత్తారు. చరిత్రలో ఏ ప్రధాని అయినా ఇలాంటి పదాలు ఉపయోగించారా అని ప్రశ్నించారు.
Similar News
News January 6, 2026
హిల్ట్ పాలసీ లీక్ కేసులో నలుగురు అధికారులు!

TG: హిల్ట్ పాలసీ సమాచారాన్ని ఇటీవల BRSకు లీక్ చేసిన వ్యవహారంలో ఇద్దరు IASలతో సహా నలుగురు అధికారుల పాత్ర ఉందని విజిలెన్స్ గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు CMOకు నివేదిక అందించగా, ఇందులో తన పాత్ర లేదని CMకు ఓ IAS వివరణ ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్(TGIIC)కి చెందిన ఇద్దరు అధికారుల ప్రమేయంపై విచారణ జరుగుతుండగా, ఓ IASను బదిలీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
News January 6, 2026
SC ఉత్తర్వులపై విపక్షాల ప్రశ్నలు

ఢిల్లీ అల్లర్ల కేసు(2020)లో సామాజిక కార్యకర్తలు ఉమర్, షర్జీల్‌లకు SC బెయిల్ నిరాకరించడాన్ని విపక్ష పార్టీలు ప్రశ్నించాయి. మహిళలపై అత్యాచారం చేసిన కేసు(2017)లో గుర్మీత్ సింగ్‌కు 15వ సారి పెరోల్‌పై కోర్టు విడుదల చేసిందని గుర్తుచేశాయి. విచారణ లేకుండా 5 ఏళ్లు నిర్బంధించడం రాజ్యాంగ విరుద్ధం కాదా? అని MA బేబీ(CPM) వ్యాఖ్యానించారు. బెయిల్ నిరాకరణ ద్వంద్వ నీతిని బహిర్గత పరుస్తోందని D.రాజా(CPI) అన్నారు.
News January 6, 2026
జ్యోతి యర్రాజీని కలిసిన మంత్రి లోకేశ్.. ₹30.35 లక్షల సాయం

AP: ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్స్‌షిప్ 100M హర్డిల్స్‌లో స్వర్ణ విజేతగా నిలిచిన జ్యోతి యర్రాజీని కలవడం సంతోషంగా ఉందని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆమెకు అభినందనలు తెలియజేశారు. ఆమె ధైర్యం, సంకల్పం దేశానికి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. ఏషియన్, కామన్వెల్త్ గేమ్స్‌లో సన్నద్ధతకు ₹30.35L సహాయాన్ని అందజేసినట్లు వెల్లడించారు. ఒలింపిక్ కలను సాకారం చేసే దిశలో ఆమెకు అండగా నిలుస్తామన్నారు.


