News May 4, 2024

ఎల్లుండి HYDకు ప్రియాంకా గాంధీ

image

TG: కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6న సాయంత్రం ఆమె హైదరాబాద్‌కు రానున్నారు. 7వ తేదీ ఉదయం 11 గంటలకు కామారెడ్డిలో బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం కూకట్‌పల్లి కార్నర్ మీటింగ్‌లో ప్రసంగిస్తారు. 8న సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్‌లో రోడ్‌షో చేస్తారు.

Similar News

News November 7, 2025

ఫోన్ అడిక్షన్: 25 ఏళ్ల తర్వాత ఇలా ఉంటారట!

image

ఇటీవల ఫోన్ అడిక్షన్ పెరిగిపోతోంది. రోజంతా రీల్స్ చూస్తూ యువత గడుపుతోంది. ఎటూ కదలకుండా, కేవలం ఫోన్‌లో మునిగిపోయే వారు 2050 నాటికి ఎలా ఉంటారో ఊహిస్తూ స్టెప్ ట్రాకింగ్ యాప్ WeWard ఓ ఫొటో షేర్ చేసింది. వెన్నెముక వంగిపోయి, జుట్టు రాలిపోయి, వృద్ధాప్యం ముందే రావడం, ముఖంపై డార్క్ సర్కిల్స్, ఊబకాయం వంటివి వస్తాయని హెచ్చరించింది. పలు ఆరోగ్య సంస్థల నుంచి సేకరించిన సమాచారంతో ‘Sam’ అనే మోడల్‌ను రూపొందించింది.

News November 7, 2025

టెక్నికల్ సమస్య వల్లే అంతరాయం: రామ్మోహన్

image

ATCలో సాంకేతిక లోపం వల్లే ఢిల్లీ, ముంబైలో విమానాల రాకపోకలకు <<18227103>>అంతరాయం<<>> ఏర్పడిందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ టెక్నికల్ సమస్య వెనుక బయటి వ్యక్తుల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. అయినా లోతైన దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు. విమానాలు సకాలంలో నడిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా చూస్తామన్నారు.

News November 7, 2025

ఈ వ్యాధులు ఉంటే అమెరికా వీసా కష్టమే!

image

వీసా నిబంధనలను కఠినం చేసే దిశగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. గుండె సంబంధ సమస్యలు, రెస్పిరేటరీ వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి వీసా నిరాకరించాలని మార్గదర్శకాలు రూపొందించినట్టు వార్తలు వస్తున్నాయి. వారిని అనుమతిస్తే ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందా? అనే అంశాలను పరిగణనలోకి తీసుకొని వీసా మంజూరు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.