News October 21, 2024
23న ప్రియాంకా గాంధీ నామినేషన్

వయనాడ్ ఉపఎన్నికలో UDF కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థిగా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అక్టోబర్ 23న(బుధవారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. దానికి ముందు కాల్పెట్టలో రాహుల్ గాంధీతో కలసి ఆమె రోడ్ షో నిర్వహిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. నామినేషన్ దాఖలు సందర్భంగా సోనియా గాంధీ, ఖర్గే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు సహా కీలక నేతలు హాజరవుతారని తెలుస్తోంది.
Similar News
News December 5, 2025
భగవంతుడిపై నమ్మకం ఎందుకు ఉంచాలి?

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః|
అనుత్తమో దురాదర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్||
దేవుడు మనలోనే అంతరాత్మగా ఉంటాడు. ధనుస్సు ధరించి పరాక్రమంతో ధైర్యాన్నిస్తాడు. ప్రజ్ఞావంతుడు, ఉన్నత క్రమశిక్షణ గల ఆయన అన్ని విషయాలకు అతీతంగా ఉంటాడు. ఎవరూ భయపెట్టలేని విశ్వాసపాత్రుడు మన కార్యాలను నెరవేరుస్తూ, సకల ఆత్మలకు మూలమై ఉంటాడు. మనం ఆ పరమాత్మను గుర్తించి, విశ్వాసం ఉంచి ధైర్యంగా జీవించాలి. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News December 5, 2025
225 అప్రెంటిస్లకు దరఖాస్తుల ఆహ్వానం

పాటియాలా లోకోమోటివ్ వర్క్స్ 225 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణులు అర్హులు. అప్రెంటిస్ల గరిష్ఠ వయసు 24ఏళ్లు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ముందుగా www.apprenticeshipindia.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్సైట్: https://plw.indianrailways.gov.in
News December 5, 2025
ప్రభుత్వ గుత్తాధిపత్య మోడల్ వల్లే ఈ దుస్థితి: రాహుల్

ఇండిగో విమాన సర్వీసులు రద్దవుతుండటంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ‘ప్రభుత్వ గుత్తాధిపత్య నమూనాకు మూల్యమే ఇండిగో వైఫల్యం. సర్వీసుల ఆలస్యం, రద్దు వల్ల సాధారణ ప్రజలు మరోసారి ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో ప్రతి రంగంలోనూ నాణ్యమైన పోటీ ఉండాలి. మ్యాచ్ ఫిక్సింగ్ గుత్తాధిపత్యాలు కాదు’ అని ట్వీట్ చేశారు. ఏడాది కిందట తాను రాసిన వ్యాసాన్ని షేర్ చేశారు.


