News June 17, 2024

తొలిసారి ఎన్నికల బరిలో ప్రియాంక.. పొలిటికల్ జర్నీ ఇలా

image

ప్రియాంకా గాంధీ తొలిసారి ఎన్నికల బరిలో నిలవనున్నారు. <<13459064>>వయనాడ్<<>> ఉపఎన్నికలో ఎంపీగా పోటీ చేయనున్నారు. ఆమె 2004 UP పార్లమెంట్, 2007 అసెంబ్లీ ఎన్నికల్లో రాయ్‌బరేలీ, అమేథీలో మాత్రమే ప్రచారం చేశారు. 2019లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. AICC జనరల్ సెక్రటరీగా నియమితులై యూపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. అప్పటి నుంచి దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతి రాష్ట్రంలో ఆమె ప్రచారం నిర్వహిస్తున్నారు.

Similar News

News November 25, 2025

తిరుమల పరకామణి కేసు.. భూమనకు నోటీసులు

image

AP: తిరుమల పరకామణి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. విచారణకు హాజరు కావాలంటూ టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఉదయం ఆయన నివాసానికి వెళ్లిన అధికారులు సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలంటూ నోటీసులు అందజేశారు.

News November 25, 2025

మహిళలపై హింసకు అడ్డుకట్ట వేద్దాం

image

మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తూ ఆకాశానికెగసినా ఇంట్లో జరిగే హింసను మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. ఈ విషయంపై ఆడవాళ్లకు సరైన అవగాహన కల్పించాలనీ, వారికి అండగా నిలబడాలనే ఉద్దేశంతో ఐరాస ఏటా నవంబర్‌ 25న ‘మహిళలపై హింస నిర్మూలనా దినోత్సవాన్ని’ నిర్వహిస్తోంది. భారత్‌లో దాదాపు 30శాతం మహిళలు సన్నిహిత భాగస్వామి నుంచే హింసను ఎదుర్కొంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక వెల్లడిస్తోంది.

News November 25, 2025

హింసకు వ్యతిరేకంగా ప్రభుత్వాల చేయూత

image

గృహహింసకి సంబంధించి జాతీయ మహిళా కమిషన్‌ వాట్సప్‌ నెంబర్‌: 72177-35372తో పాటు ఆ సంస్థ వెబ్‌సైట్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో బాధితులు 181, 1091, 100 నంబర్లకు ఫోన్‌ చేస్తే తక్షణం పోలీస్‌ సాయం అందుతుంది. స్త్రీ, శిశు సంక్షేమ కార్యాలయాల్లోనూ ఫిర్యాదు చేసే వ్యవస్థలు ఉన్నాయి. వీటితో పాటు ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేసి, రక్షణ కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.