News November 23, 2024
24వేల ఓట్ల ఆధిక్యంలో ప్రియాంక
వయనాడ్ ఉపఎన్నికలో ప్రియాంకా గాంధీ పూర్తి ఆధిపత్యం కనబరుస్తున్నారు. ప్రస్తుతం ఆమె 24వేల ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు. ఇక్కడ రాహుల్ గాంధీ తన ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైంది.
Similar News
News November 23, 2024
ముందంజలో కొనసాగుతున్న స్వరా భాస్కర్ భర్త
మహారాష్ట్రలోని అనుశక్తి నగర్ అసెంబ్లీ స్థానం నుంచి నటి స్వర భాస్కర్ భర్త, NCP SP అభ్యర్థి ఫహద్ అహ్మద్ ముందంజలో ఉన్నారు. సమీప ప్రత్యర్థి, నవాబ్ మాలిక్ కూతురు సనా మాలిక్‌పై 4 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మహారాష్ట్ర నవనిర్మాణ సేనకు చెందిన ఆచార్య నవీన్ విద్యాధర్ 17,553 ఓట్లతో వెనుకబడి మూడో స్థానంలో నిలిచారు. 2019లో ఉమ్మడి ఎన్సీపీ అభ్యర్థిగా నవాబ్ మాలిక్ 65 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.
News November 23, 2024
చంద్రబాబుపై రాళ్ల దాడి.. నిందితుల అరెస్ట్
AP: రెండేళ్ల క్రితం సీఎం చంద్రబాబుపై రాళ్ల దాడి చేసిన నిందితులను పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. నిందితులను కనికంటి సజ్జన్ రావు, బెజవాడ కార్తీక్, పరిమి కిశోర్‌గా గుర్తించారు. కాగా 2022 నవంబర్ 5న చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పర్యటించారు. రోడ్ షో చేస్తున్న సమయంలో లైట్లు ఆర్పేసి చంద్రబాబుపై కొందరు రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుకు గాయాలయ్యాయి.
News November 23, 2024
రాజకీయ చాణక్యుడి ఘోర పరాభవం
మహారాష్ట్ర ఫలితాలు అపర చాణక్యుడిగా పేరొందిన శరద్ పవార్‌కు ఘోర పరాభవాన్ని మిగిల్చాయి. ఆయన పార్టీ కేవలం 13 స్థానాలకు పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. 2019లో 54, 2014లో 41, 2009లో 62, 2004లో 71 సీట్లు గెలిచిన శరద్ పవార్ సారథ్యంలోని NCP ఈ ఎన్నికల్లో చతికిలపడింది. 86 స్థానాల్లో పోటీ చేసినా ప్రభావం చూపలేకపోయింది. NCP SP మనుగడ ఇక కష్టమని పలువురు విశ్లేషిస్తున్నారు.