News April 8, 2025
ప్రియాంశ్ దూకుడు.. 19 బంతుల్లోనే ఫిఫ్టీ

IPL: చెన్నైతో జరుగుతున్న మ్యాచులో పంజాబ్ యువ బ్యాటర్ ప్రియాంశ్ ఆర్య అదరగొడుతున్నారు. పవర్ ప్లేలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయినా దూకుడుగా ఆడుతున్నారు. ఈ క్రమంలో 19 బంతుల్లో 4 సిక్సర్లు, 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం పంజాబ్ స్కోర్ 6 ఓవర్లలో 75/3గా ఉంది. ప్రభ్సిమ్రాన్ (0), శ్రేయస్ అయ్యర్ (9), స్టాయినిస్ (4) ఔటయ్యారు.
Similar News
News November 27, 2025
ఎలక్టర్ల మ్యాపింగ్‌లో పురోగతి ఉండాలి: కర్నూల్ కలెక్టర్

ఎలక్టర్ల మ్యాపింగ్ ప్రక్రియలో మరింత పురోగతి తీసుకురావాలని కర్నూల్ జిల్లా కలెక్టర్ సిరినీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ సూచించారు. గురువారం విజయవాడలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌పై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ ఫార్ములను త్వరితగతిన క్లియర్ చేయాలని, బీఎల్ఓ, ఎపిక్ కార్డు పంపిణీ, మ్యాపింగ్, శిక్షణ విషయాలను వేగవంతంచేయాలని సూచించారు.
News November 27, 2025
శివజ్యోతి ఆధార్ కార్డును టీటీడీ బ్లాక్ చేసిందా?.. క్లారిటీ ఇదే!

AP: ప్రముఖ యాంకర్ శివజ్యోతికి TTD షాక్ ఇచ్చిందన్న వార్త తెగ వైరల్ అవుతోంది. ఆమె భవిష్యత్‌లో శ్రీవారిని దర్శించుకోకుండా ఆధార్ కార్డును బ్లాక్ చేసిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో వాస్తవం లేదు. TTD దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. శ్రీవారి ప్రసాదం తీసుకుంటూ ‘కాస్ట్లీ బిచ్చగాళ్లం’ అంటూ <<18363529>>వీడియో<<>> చేయడంతో ఈ దుమారం రేగింది. ఆమె ఆధార్ బ్లాక్ చేయాలని పలువురు కోరారు. కానీ TTD ఆ నిర్ణయం తీసుకోలేదు.
News November 27, 2025
గంభీర్‌ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు: గవాస్కర్

టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్‌కు క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మద్దతుగా నిలిచారు. ప్లేయర్లను సిద్ధం చేయడమే కోచ్ పని అని, గ్రౌండ్లోకి దిగి ఆడాల్సింది ప్లేయర్లేనని స్పష్టం చేశారు. ‘ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ విజయాలకు క్రెడిట్ ఇవ్వనప్పుడు, ఇప్పుడు మాత్రం ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? జవాబుదారీతనం ఎందుకు అడుగుతున్నారు? జీవితాంతం కోచ్‌గా ఉండాలని అతడు ట్రోఫీలు గెలిచినప్పుడు అడిగారా?’ అని నిలదీశారు.


