News August 9, 2024
ఒలింపిక్ మెడల్తో దేశానికొస్తే వారికిచ్చే ప్రైజ్మనీ!

పారిస్ ఒలింపిక్స్లో మెడల్స్ సాధించేందుకు వివిధ దేశాల అథ్లెట్లు శ్రమిస్తున్నారు. అయితే, మెడల్స్ సాధించిన అథ్లెట్లకు ఆయా దేశాలిచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసుకుందాం. నార్వే దేశం ఒక్క రూపాయి ఇవ్వదు. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ ప్రైజ్మనీలు వరుసగా.. ఇండియాలో రూ.75 లక్షలు,రూ. 50లక్షలు,రూ.25 లక్షలు. USAలో $37,000, $22,500, $15,000. సింగపూర్లో $7,44,000, $3,72,000, $1,86,000లు అథ్లెట్లు పొందనున్నారు.
Similar News
News October 16, 2025
PHOTO GALLERY: మోదీ ఏపీ పర్యటన

AP: ప్రధాని మోదీ ఇవాళ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు. తొలుత శ్రీశైలంలో భ్రమరాంబికా దేవి, మల్లికార్జున స్వామి వార్లకు పూజలు చేశారు. అనంతరం గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, కేంద్రమంత్రులు రామ్మోహన్, పెమ్మసాని, భూపతి రాజులతో కలిసి బహిరంగ సభలో పాల్గొన్నారు. మోదీ పర్యటన ఫొటోలను పైన గ్యాలరీలో చూడండి.
News October 16, 2025
3 కొత్త అగ్రికల్చర్ కాలేజీలు.. ఇక్కడే

TG: జయశంకర్ వర్సిటీకి అనుబంధంగా కొత్తగా 3 వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నల్గొండ, నిజామాబాద్, వికారాబాద్ జిల్లాల్లో ఈ కాలేజీలను నిర్మించనుంది. అటు రూ.10,500 కోట్లతో 5,500 కిలోమీటర్ల హ్యామ్ రోడ్ల నిర్మాణానికి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.
News October 16, 2025
డిసెంబర్ 1 నుంచి ప్రజాపాలన ఉత్సవాలు.. కొత్త అప్లికేషన్ల స్వీకరణ

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా DEC 1-9 వరకు ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. గ్రామగ్రామాన జరిగే ఈ ఉత్సవాల్లో పలు సంక్షేమ పథకాలకు దరఖాస్తులు తీసుకోనున్నారు. ఏయే పథకాలకు అప్లికేషన్లు స్వీకరించాలనే అంశంపై రెండు రోజుల్లో సీఎస్ అధ్యక్షతన సమావేశమై వివరాలు వెల్లడించనున్నారు.