News October 31, 2025

Pro Kabaddi: నేడే ఫైనల్ పోరు

image

ప్రో కబడ్డీ లీగ్ సీజన్-12 ఫైనల్ పోరులో ఇవాళ దబాంగ్ ఢిల్లీ K.C. జట్టు పుణేరి పల్టాన్‌తో తలపడనుంది. ఢిల్లీలో రా.8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ఈ 2 జట్ల మధ్య తుది సమరం జరగనుండటంతో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. 2021-22 సీజన్‌లో ఢిల్లీ టైటిల్‌ సాధించగా 2023-24లో పుణేరి కప్పు కొట్టింది. దీంతో ఈ 2 టీమ్‌ల్లో ఎవరు నెగ్గినా రెండోసారి టైటిల్‌ను ముద్దాడనున్నాయి.

Similar News

News October 31, 2025

వాడని సిమ్స్‌ను డియాక్టివేట్ చేయండిలా!

image

చాలామంది ప్రస్తుతం ఒక సిమ్ మాత్రమే వాడుతున్నా ఆధార్ కార్డుపై ఎక్కువ సిమ్స్ యాక్టివ్‌లో ఉంటున్నాయి. ఇలాంటి అనవసరమైన సిమ్ కార్డులను డియాక్టివేట్ చేయడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. ఆధార్‌పై ఎన్ని సిమ్స్ ఉన్నాయో తెలుసుకొని, వాటిని క్యాన్సిల్ చేసేందుకు ‘TAFCOP’ పోర్టల్‌ అందుబాటులో ఉంది. మొబైల్ నం. & ఆధార్‌తో లాగిన్ అయి సిమ్ వివరాలు తెలుసుకోవచ్చు. అనవసరమైన వాటి డియాక్టివేషన్‌కు రిక్వెస్ట్ చేయొచ్చు.

News October 31, 2025

CSల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

image

వీధికుక్కల కేసులో అధికారుల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా రాష్ట్రాల CSలు సోమవారం ఫిజికల్‌గా హాజరు కావాలని ఆదేశించింది. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించింది. వర్చువల్ హాజరుకు అనుమతించాలని SG కోరగా తిరస్కరించింది. GOVT, MNPలు పరిష్కరించాల్సిన అంశాలపై కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారని మండిపడింది. TG, DL, WB మినహా ఇతరులు అఫిడవిట్లు ఎందుకు వేయలేదో సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది.

News October 31, 2025

వృద్ధాప్యంలో ఒంటరితనం వేధిస్తోందా?

image

వృద్ధాప్యంలో ఒంటరితనం అతి పెద్ద సమస్య. పిల్లలు ఎక్కడో దూరంగా ఉండడం, ఏమైనా అయితే పిల్లలు రాగలరో లేరో అనీ కలవరపడతారని నిపుణులు చెబుతున్నారు. ఒంటరితనంతో గతం గురించి ఆలోచిస్తూ కుంగుబాటుకూ లోనవుతారు. రోజూ కాసేపు ధ్యానం చేయడం, స్నేహితులు, బంధువులతో సమయం గడపడం వంటివి మేలు చేస్తాయంటున్నారు. మనసును ఉల్లాసంగా ఉంచుకుంటే ఒంటరిననే భావన తగ్గుతుందని చెబుతున్నారు.