News December 29, 2024
నేడు ప్రో కబడ్డీ లీగ్ ఫైనల్

ప్రో కబడ్డీ లీగ్-2024 ఫైనల్ నేడు జరగనుంది. హరియాణా స్టీలర్స్, పట్నా పైరెట్స్ తుది సమరంలో తలపడనున్నాయి. రా.8 గంటలకు మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో నం.1గా ఉన్న హరియాణా తొలి సారి ట్రోఫీని ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు మూడుసార్లు విజేతగా నిలిచిన పట్నా నాలుగో టైటిల్‌పై కన్నేసింది.
Similar News
News October 21, 2025
తొలి వన్డేలో ఆ ప్లేయర్‌ను తీసుకోవాల్సింది: కైఫ్

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఆడించి ఉండాల్సిందని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డారు. తుది జట్టులో అన్నీ కవర్ చేసినా వికెట్ టేకింగ్ బౌలర్‌ను తీసుకోలేదని చెప్పారు. AUS దిగ్గజ బౌలర్ షేన్ వార్న్ అన్ని ఫార్మాట్లలో రాణించారని గుర్తు చేశారు. తొలి వన్డేలో ఆసీస్ స్పిన్నర్ మాథ్యూ కునెమన్ 2 వికెట్లు తీశారని తెలిపారు. క్వాంటిటీ కోసం క్వాలిటీ విషయం రాజీ పడ్డారన్నారు.
News October 21, 2025
అమెరికన్లకు ట్రంప్ దీపావళి విషెస్

ప్రపంచ దేశాధినేతలు సైతం హిందువులనుద్దేశించి దీపావళి విషెస్ చెబుతారు. అయితే US అధ్యక్షుడు ట్రంప్ ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. దీపావళి సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి అమెరికన్‌కు విషెస్ తెలియజేశారు. ఈ పండుగ కుటుంబాలను, స్నేహితులను, కమ్యూనిటీలను ఏకం చేసి నమ్మకాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. అయితే హిందువులు, ఇండియన్స్‌ను విష్ చేయకుండా ట్రంప్ బుద్ధి చూపిస్తున్నాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
News October 21, 2025
అక్టోబర్ 21: చరిత్రలో ఈరోజు

1833: శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి వ్యవస్థాపకుడు ఆల్ఫ్రెడ్ నోబెల్ జననం(ఫొటోలో-R)
1947: ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు జననం
1967: అథ్లెట్ అశ్వినీ నాచప్ప జననం
1986: సినీ దర్శకుడు టి.కృష్ణ మరణం(ఫొటోలో-L)
1992: హీరోయిన్ శ్రీనిధి శెట్టి జననం
1996: ప్రముఖ చిత్రకారుడు పాకాల తిరుమల్ రెడ్డి మరణం
✦పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం