News December 21, 2024
ప్రో కబడ్డీ లీగ్.. తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్‌కు వెళ్లేనా?

ప్రో కబడ్డీ లీగ్ సీజన్-11 లీగ్ స్టేజీలో భాగంగా తమ చివరి మ్యాచులో పుణెరి పల్టాన్‌పై తెలుగు టైటాన్స్ 48-36 తేడాతో గెలిచింది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో ఏడో స్థానంలో ఉంది. ఇప్పటికే 4 జట్లు ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై కాగా, ఆరో స్థానం కోసం U ముంబా, టైటాన్స్ మధ్య పోటీ ఉంది. U ముంబాకు ఇంకా 2 లీగ్ మ్యాచులు మిగిలి ఉన్నాయి. ఆ రెండింటిలో ఆ జట్టు భారీ తేడాతో ఓడితేనే తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్‌కు వెళ్తుంది.
Similar News
News December 3, 2025
సివిల్ కాంట్రాక్టర్ల నుంచి దరఖాస్తుల ఆహ్వానం: ASF SP

ఆసిఫాబాద్ జిల్లాలో పోలీస్ శాఖ భరోసా సెంటర్ భవన నిర్మాణానికి సివిల్ కాంట్రాక్టర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు SP నితికా పంత్ తెలిపారు. డిసెంబర్ 4న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు AR పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో విల్లింగ్ కొటేషన్స్ స్వీకరిస్తామన్నారు. రూ.కోటిపైగా వ్యయంతో నిర్మాణ అనుభవం, 10 ఏళ్ల సేవ, 4 నెలల్లో పని పూర్తి చేసే సామర్థ్యం అర్హతలుగా పేర్కొన్నారు.
News December 3, 2025
రూ.3.30 నుంచి రూ.90 వరకు.. రూపాయి పతనం ఇలా!

స్వాతంత్య్రం(1947) వచ్చేనాటికి డాలరుతో రూపాయి మారకం విలువ రూ.3.30 ఉండేది. 30 సంవత్సరాల తర్వాత..
☛ 1977లో అది రూ.8.434కు చేరింది
☛ తరువాతి 30 ఏళ్ల(2007)కు 43.595గా ఉంది
☛ 2020లో రూ.73.23, 2021లో రూ.74.56, 2022లో రూ.82.76, 2023లో 83.4
☛ 2024లో 83.28కు బలహీనపడింది
☛ తాజాగా 2025 డిసెంబర్ నాటికి 90 రూపాయలకు పతనమైంది.
News December 3, 2025
భారీ ఎన్కౌంటర్.. 15 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా దంతెవాడ అడవుల్లో జరిగిన భారీ <<18458130>>ఎన్కౌంటర్లో<<>> మృతుల సంఖ్య పెరిగింది. ఎదురుకాల్పుల్లో 12 మంది మావోలు మరణించగా ముగ్గురు పోలీసులు అమరులయ్యారు. ఘటనాస్థలం నుంచి మావోలకు సంబంధించిన భారీ ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు జనవరి 1న అంతా లొంగిపోతామని ఇటీవల అభయ్ పేరిట మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.


