News March 22, 2024
ఒత్తిడితో సమస్యలు ఇంతింత కాదయా..

ఈ డిజిటల్ యుగంలో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఒత్తిడి. ఉద్యోగం, వ్యక్తిగత జీవితంలో సమస్యలతో తరచూ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఇది ఫిజికల్, మెంటల్ హెల్త్పై ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తలనొప్పి, అలసట, అజీర్తి, BP, షార్ట్ టెంపర్, వాయిదా వేయడం, నిర్లక్ష్యం ఆవహించడం వంటి సమస్యలు చుట్టుముడతాయట. ప్రెజర్ మేనేజ్మెంట్ చేసుకోలేకపోతే ఇవి దీర్ఘకాలిక సమస్యలుగా వేధిస్తాయంటున్నారు.
Similar News
News February 25, 2025
అకౌంట్లలో డబ్బులు.. సీఎం కీలక ప్రకటన

TG: మార్చి 31లోపు అన్నదాతల అకౌంట్లలో రైతు భరోసా డబ్బులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటివరకు 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు నిధులు జమ చేసింది. ఇకపై మిగతావారికీ అందజేస్తామని సీఎం వెల్లడించారు. కాగా తొలుత ఎకరం వరకు ఉన్న 17 లక్షల మందికి రూ.557.54Cr, రెండెకరాల వరకు ఉన్న 13.23 లక్షల మందికి రూ.1130.29Cr, మూడెకరాల వరకు ఉన్న 9.56 లక్షల మందికి రూ.1230.98Cr ఖాతాల్లో వేశారు.
News February 25, 2025
ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. త్వరలో మొబైల్స్కు లింకులు

TG: ఇంటర్ హాల్ టికెట్లను రిలీజ్ చేసినట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. కాలేజీల లాగిన్లలో హాల్ టికెట్లు అప్లోడ్ చేసినట్లు పేర్కొన్నారు. అతి త్వరలోనే విద్యార్థుల మొబైల్ నంబర్లకు హాల్ టికెట్ల డౌన్లోడ్ లింకును పంపిస్తామన్నారు. మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానుండగా 9.5 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
News February 25, 2025
శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

AP: తిరుమలలో టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనం కోసం 8 గంటలు పడుతోంది. 4 కంపార్ట్మెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనానికి వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 66,764 మంది భక్తులు దర్శించుకోగా, వారిలో 23,504 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.14కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. నిన్న 4.8లక్షల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను TTD రిలీజ్ చేయగా 20 నిమిషాల్లోనే బుక్ అయ్యాయి.