News February 28, 2025
నిర్మాత మృతి.. రూ.100 కోట్ల కోసం మాజీ ఎమ్మెల్యేల కంగారు?

TG: దుబాయ్‌లో నిర్మాత కేదార్ మృతి వెనుక మిస్టరీ తేలడం లేదు. గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తుండగా పోస్టుమార్టంలోనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. మరోవైపు కేదార్ వద్ద పలువురు మాజీ MLAలు రూ.100 కోట్ల డబ్బు ఉంచినట్లు సమాచారం. ఆయన చనిపోవడంతో ఎలా రాబట్టుకోవాలో తెలియక కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 22, 2026
కాసేపట్లో కేసీఆర్‌ను కలవనున్న కేటీఆర్, హరీశ్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసుల నేపథ్యంలో మాజీ CM KCRతో KTR, హరీశ్ రావు భేటీ కానున్నారు. కాసేపట్లో వారిద్దరూ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలా ముందుకెళ్లాలనే దానిపై గులాబీ బాస్‌తో చర్చించనున్నారు. ఇప్పటికే హరీశ్‌ను సిట్ విచారించగా రేపు రావాలని KTRకు నోటీసులు ఇచ్చింది. దీనిపై సాయంత్రం 6 గంటలకు సిరిసిల్ల తెలంగాణ భవన్లో కేటీఆర్ ప్రెస్‌మీట్ పెట్టనున్నారు.
News January 22, 2026
రోడ్డు మీద వెళ్తుంటే డబ్బు దొరికిందా?

రోడ్డుపై వెళ్తుంటే డబ్బు దొరకడం యాదృచ్చికం కాదని, భగవంతుడి సంకేతమని జ్యోతిషులు చెబుతున్నారు. ‘నాణెం దొరికితే కొత్త పనుల్లో విజయం, ఆర్థిక లాభాలు సిద్ధిస్తాయి. నోటు దొరకడం లక్ష్మీదేవి కటాక్షానికి సూచిక. ఇలా దొరికిన సొమ్మును ఖర్చు, దానం చేయకూడదు. దైవ ప్రసాదంగా భావించి, పర్సు/పూజా గదిలో భద్రపరచాలి. తద్వారా మనిషికి/ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఉదయం వేళ డబ్బు దొరకడం రెండింతలు అదృష్టం’ అంటున్నారు.
News January 22, 2026
SECLలో 66 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

సౌత్ ఈస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (<


