News January 21, 2025

నిర్మాత మనో అక్కినేని మృతి

image

తమిళ సినీ నిర్మాత మనో అక్కినేని మృతి చెందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 19న ఆమె కన్నుమూయగా సన్నిహితురాలు సుధ కొంగర ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తన తొలి సినిమా ‘ద్రోహి’ని మనో నిర్మించి వెండితెరకు పరిచయం చేశారని గుర్తు చూసుకుంటూ సుధ ఎమోషనల్ పోస్ట్ చేశారు. సినిమాలే జీవితంగా వాటిని ప్రేమించిన వ్యక్తి దూరం కావడం బాధాకరమన్నారు. కొంగర జగ్గయ్య కుటుంబం నుంచి మనో వచ్చారు.

Similar News

News January 20, 2026

రాజేంద్రన్ గుండు కథ తెలుసా?

image

తమిళ నటుడు రాజేంద్రన్ గుండు వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. స్టంట్‌మన్‌గా సినీ కెరీర్ ప్రారంభించిన ఆయన 20 ఏళ్ల క్రితం బైక్‌పై నుంచి జంప్ చేస్తూ కెమికల్స్‌లో పడిపోయారు. అలర్జీలతో శాశ్వతంగా తన తల వెంట్రుకలతో పాటు కనుబొమ్మలు సైతం కోల్పోయారు. ఆ లుక్కునే తన ఐడెంటిటీగా మార్చుకున్నారు రాజేంద్రన్. పూర్తిగా గుండుతో పవర్‌ఫుల్ విలన్‌గా, కమెడియన్‌గా 500పైగా సినిమాల్లో నటించారు. ఎంతో ఇన్‌స్పిరేషన్ కదా!

News January 20, 2026

ఒకే రోజు రెండు భారత్-పాక్ మ్యాచ్‌లు

image

Feb 15న క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగనే చెప్పాలి. భారత్-పాక్ జట్ల మధ్య ఆరోజు రెండు హై-వోల్టేజ్ మ్యాచ్‌లు జరగనుండటం విశేషం. ICC మెన్స్ T20 వరల్డ్ కప్‌లో భాగంగా మెయిన్ టీమ్స్ తలపడనుండగా, అదే రోజు థాయ్‌లాండ్‌లో జరిగే ఉమెన్స్ ఏషియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో భారత్-పాక్ ‘A’ జట్లు పోటీ పడతాయి. ఈ డబుల్ ధమాకా కోసం ఇరు దేశాల క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

News January 20, 2026

LRS.. 4 రోజులే గడువు

image

AP: అనుమతి లేని ప్లాట్ల క్రమబద్ధీకరణకు 4 రోజులే అవకాశం ఉంది. LRSకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఈ నెల 23 వరకు గడువు విధించింది. రాష్ట్రంలో 9 వేల ఎకరాల మేర అనధికార లేఅవుట్లు ఉన్నట్లు అధికారుల అంచనా. ఇప్పటిదాకా 6 వేల ఎకరాల్లోని ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం 52 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. మరో 25 వేల అప్లికేషన్లు రావొచ్చని తెలుస్తోంది. కాగా గడువు పొడిగించాలని ప్రజల నుంచి వినతులు వస్తున్నాయి.