News June 15, 2024

ఈడీ విచారణలో ‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాత

image

‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాత, నటుడు సౌబిన్ షాహీర్‌ను ఈడీ ప్రశ్నిస్తోంది. మనీలాండరింగ్ కేసులో ఆయనను ఈడీ విచారిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మంజుమ్మల్ బాయ్స్ సినిమా రూ.20 కోట్లతో రూపొందించగా రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. 2006లో 10 మంది స్నేహితులు గుణ కేవ్స్ సందర్శనకు వెళ్తారు. అక్కడ సుభాష్ అనే వ్యక్తి లోయలో పడిపోతాడు. అతడిని ఎలా కాపాడారనేది సినిమా కథ.

Similar News

News November 21, 2025

ములుగు: నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలకు స్పెషల్ ఫండ్!

image

వామపక్ష తీవ్రవాద ప్రభావిత(LWE)గా గుర్తించిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం రూ.వేల కోట్ల నిధులను ఖర్చు చేసింది. 2014-25 మధ్య కాలంలో ఏకంగా 12 వేల కిలోమీటర్ల మేర కొత్త రోడ్లను నిర్మించారంటే అతిశయోక్తి కాదు. మౌలిక వసతులు, ఉపాధి, విద్య, వైద్యం కోసం ఎక్కువ మొత్తంలో నిధులు వెచ్చించారు. మారుమూల గ్రామాలలో సెల్ ఫోన్ టవర్లు ఏర్పాటు చేశారు. నెట్‌వర్క్ పెరగడంతో మావోల కదలికల గుర్తింపు పోలీసులకు ఈజీ అయ్యింది.

News November 21, 2025

OTTలోకి వచ్చేసిన ‘బైసన్’

image

చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ హీరోగా నటించిన ‘బైసన్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మారి సెల్వరాజ్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రంలో అనుపమ, పశుపతి కీలక పాత్రలు పోషించారు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రూ.70 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో ధ్రువ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

News November 21, 2025

హ్యాపీగా ఉండాలంటే ఈ ఫుడ్స్ తినండి

image

మనల్ని ఆనందంగా ఉంచే హార్మోన్ అయిన డోపమైన్ ఆహారంలోనూ దొరుకుతుందంటున్నారు నిపుణులు. ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. బెర్రీస్, అరటిపండ్లు, నట్స్, ఫ్యాటీ ఫిష్, ప్రోబయాటిక్స్, ఓట్స్, ఆకుకూరలు, గుడ్లు, అవకాడో వంటివి ఆహారంలో చేర్చుకోవడంవల్ల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. వీటి వల్ల మూడ్ బాగుండటమే కాకుండా మెంటల్ క్లారిటీ, డిప్రెషన్ లక్షణాలు తగ్గించి ఎమోషనల్‌ హెల్త్ బావుండేలా చూస్తాయంటున్నారు నిపుణులు.