News April 6, 2025

స్టార్ హీరోయిన్‌పై నిర్మాత కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్

image

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌పై స్త్రీ-2 మూవీ నిర్మాత దినేశ్ విజాన్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి. శ్రద్ధా నవ్వితే అచ్చం దెయ్యంలా ఉంటుందని, అందుకే స్త్రీ మూవీలో ఎంపిక చేసినట్లు దినేశ్ చెప్పారని ఆ సినిమా డైరెక్టర్ అమర్ కౌశిక్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో శ్రద్ధా ఫ్యాన్స్ దినేశ్‌పై మండిపడుతున్నారు. ఆమె పేరుతో డబ్బులు సంపాదించుకుని ఇలా అవమానించడం సరికాదని కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News November 28, 2025

నాన్-ఏసీ కోచ్‌ల్లోనూ దుప్పటి, దిండు

image

రైలు ప్రయాణికులకు సదరన్ రైల్వే శుభవార్త చెప్పింది. 2026 జనవరి 1 నుంచి నాన్-ఏసీ స్లీపర్‌లో కూడా దుప్పటి, దిండు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. ఇందుకోసం ప్రయాణికులు నిర్ణీత ఛార్జీలు చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు రూ.50, రూ.30, రూ.20లలో మూడు ప్యాకేజీలు తీసుకొచ్చింది. ఈ సౌకర్యాన్ని చెన్నై డివిజన్ ఎంపిక చేసిన 10 రైళ్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తోంది.

News November 28, 2025

హైదరాబాదీ బిర్యానీ.. వరల్డ్‌లో బెస్ట్!

image

భారతీయులు ఇష్టపడే వంటకాల్లో ఒకటైన హైదరాబాదీ బిర్యానీ ప్రపంచ గుర్తింపు పొందింది. ప్రఖ్యాత ఫుడ్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ విడుదల చేసిన ‘వరల్డ్ బెస్ట్‌ రైస్‌ డిషెస్‌’ లిస్టులో HYD బిర్యానీ 10వ స్థానంలో నిలిచింది. టాప్-50లో ఇండియా నుంచి ఉన్న ఏకైక వంటకం ఇదే కావడం విశేషం. కాగా తొలి మూడు స్థానాల్లో జపాన్ వంటకాలైన ‘నెగిటోరో డాన్’, ‘సుశి’, ‘కైసెండన్’ ఉన్నాయి. ప్రపంచమే మెచ్చిన HYD బిర్యానీ మీకూ ఇష్టమా?COMMENT

News November 28, 2025

RECORD: ఎకరం రూ.151.25 కోట్లు

image

HYD: కోకాపేట-నియోపొలిస్ లేఅవుట్‌లో HMDA నిర్వహించిన భూముల వేలం మరోసారి రికార్డులు సృష్టించింది. ప్లాట్ నంబర్ 15లో ఎకరం రూ.151.25 కోట్లకు GHR సంస్థ దక్కించుకుంది. ప్లాట్ నంబర్ 16లో ఎకరం రూ.147.75 కోట్లకు గోద్రేజ్ సంస్థ సొంతం చేసుకుంది. మొత్తం 9.06 ఎకరాలకు వేలం వేయగా ప్రభుత్వానికి రూ.1353 కోట్ల భారీ ఆదాయం లభించింది. గత వారం ఇదే లేఅవుట్‌లో ఎకరం <<18376950>>రూ.137.25 కోట్లు<<>> పలికింది.