News July 26, 2024
హీరో విశాల్ సినిమాలపై నిర్మాతల మండలి ఆంక్షలు

హీరో విశాల్తో ఎవరూ పనిచేయొద్దంటూ తమిళ నిర్మాతల మండలి ఒక లేఖ విడుదల చేసింది. ఆయనతో సినిమా తీయాలంటే అనుమతి తప్పనిసరి అని ఆంక్షలు విధించింది. 2017-19 మధ్య నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న ఆయన, రూ.12కోట్లు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆరోపణలను విశాల్ ఖండించారు. తాను ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని తెలిపారు.
Similar News
News December 7, 2025
ప.గో డిగ్రీ విద్యార్థులకు గమనిక

ఆదికవి నన్నయ యూనివర్సిటీ మూడు క్యాంపస్లో పీజీ కోర్సులకు ఈ నెల 8-12 వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ఉపకులపతి ఎస్. ప్రసన్నశ్రీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం, కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్లలోని MA, M.com,Mped,Msc కోర్సులకు రాజమహేంద్రవరంలో ఉదయం10-4 గంటల వరకు స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయన్నారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.
News December 7, 2025
విత్తన మొలక శాతం.. పంట దిగుబడికి ముఖ్యం

పంట దిగుబడి బాగుండాలన్నా, వ్యవసాయం లాభసాటిగా సాగాలన్నా పంటకు ‘విత్తనం’ ప్రధానం. అందుకే మేలైన దిగుబడి కోసం మొలక శాతం బాగా ఉన్న విత్తనాన్ని సేకరించాలి. విత్తన కొనుగోలు తర్వాత దాని మొలక శాతాన్ని పరిశీలించాలి. అది నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే విత్తుకోవాలి. అసలు విత్తన మొలక శాతాన్ని ఎలా పరిశీలించాలి? దానికి అందుబాటులో ఉన్న పద్ధతులు ఏమిటో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 7, 2025
ఒకరికి 38, మరొకరికి 37.. అయితేనేం అదరగొట్టారు

SAతో జరిగిన వన్డే సిరీస్ను భారత్ కైవసం చేసుకోవడంలో ‘రో-కో’ కీలక పాత్ర పోషించారు. గత రెండు సిరీస్లను గమనిస్తే ఒక్కోసారి ఒక్కో స్టార్ అదరగొట్టారు. AUSతో జరిగిన సిరీస్లో రోహిత్ శర్మ(38y) అత్యధిక పరుగులు, సగటు, బౌండరీలు, P.O.Sగా నిలిస్తే, తాజాగా SAతో జరిగిన సిరీస్లో అవే రికార్డులు విరాట్ కోహ్లీ (37y) దక్కించుకున్నారు. 37+ ఏళ్ల వయసులోనూ ఈ ఇద్దరూ సూపర్ ఫామ్ కొనసాగిస్తూ విజయాలను అందిస్తున్నారు.


