News April 20, 2024
మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కీలక వ్యాఖ్యలు

సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి కాంబోలో SSMB29 అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమా నిర్మాత గోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఈ సినిమా గురించి రాజమౌళికి తప్ప మరెవరికీ వివరాలు తెలియవు. స్టోరీ, షూటింగ్, క్యాస్టింగ్, రిలీజ్ వంటి విషయాలు ఆయనొక్కరికే తెలుసు. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’ అని ఆయన చెప్పారు.
Similar News
News March 31, 2026
PHOTOS: కోదండరాముడి కళ్యాణానికి ముస్తాబైన ఒంటిమిట్ట

AP: ఒంటిమిట్టలో రేపు జరగబోయే కోదండరాముడి కళ్యాణానికి TTD భారీ ఏర్పాట్లు చేసింది. వేడుక జరిగే ప్రధాన వేదికతో పాటు భక్తులు కూర్చొనేందుకు ఆలయ సమీపంలో గ్యాలరీలు ఏర్పాటయ్యాయి. వేలాదిగా తరలివచ్చే భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, మజ్జిగ అందించనుంది. అలాగే కళ్యాణం అనంతరం తలంబ్రాల ప్యాకెట్లు, శ్రీవారి ప్రసాదం ఇవ్వనుంది. సీఎం చంద్రబాబు రేపు సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొననున్న విషయం తెలిసిందే.
News March 31, 2026
రోహిత్ ఔట్ కాగానే టీవీ ఆఫ్ చేస్తా: బట్లర్

KKRతో మ్యాచ్‌లో MI ఓపెనర్ రోహిత్ ఇన్నింగ్స్(78)పై GT స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ ఓ పాడ్‌కాస్ట్‌లో ప్రశంసలు కురిపించారు. హిట్‌మ్యాన్ తన ఫేవరెట్ క్రికెటర్ అని తెలిపారు. తానెప్పుడూ అతని బ్యాటింగ్ చూస్తూ ఉంటానన్నారు. సాధారణంగా టీవీ ఎక్కువగా చూడనని, రోహిత్ బ్యాటింగ్ కోసమే దాన్ని ఆన్ చేస్తానని తెలిపారు. హిట్ మ్యాన్ ఔట్ కాగానే టీవీ ఆఫ్ చేస్తానని వెల్లడించారు. గతంలో బట్లర్ ముంబై తరఫున ఆడిన విషయం తెలిసిందే.
News March 31, 2026
ఒరాకిల్ ఝలక్.. 30,000 మందికి లేఆఫ్స్

AI, డేటా సెంటర్లలో భారీగా పెట్టుబడులు పెడుతున్న సాఫ్ట్‌వేర్ సంస్థ ఒరాకిల్ తమ ఉద్యోగులను మరోసారి తొలగిస్తోంది. తమకు లేఆఫ్స్ మెయిల్స్ వచ్చినట్లు పలువురు ఉద్యోగులు SMలో పోస్టులు పెడుతున్నారు. ఈ కంపెనీకి భారత్‌తో సహా ప్రపంచ వ్యాప్తంగా 1,62,000 మంది ఉద్యోగులు ఉండగా దాదాపు 18% అంటే 20,000 నుంచి 30,000 మందిని తొలగిస్తోందని నివేదికలు చెబుతున్నారు. 2023 నుంచి పలుమార్లు ఒరాకిల్ లేఆఫ్స్ ప్రకటించింది.


