News June 24, 2024

గన్నవరం చేరుకున్న నిర్మాతలు

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సమావేశం కోసం హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన నిర్మాతలు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విజయవాడ క్యాంప్ ఆఫీస్‌లో మరి కాసేపట్లో ఆయన్ను కలవనున్నారు. వీరిలో అల్లు అరవింద్, సురేశ్ బాబు, అశ్వినీదత్, ఎర్నేని నవీన్, టీజీ విశ్వప్రసాద్, సుప్రియ యార్లగడ్డ తదితరులున్నారు. చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలపై పవన్‌తో చర్చించి పరిష్కారం కనుగొంటామని నిర్మాత అశ్వినీదత్ వెల్లడించారు.

Similar News

News December 5, 2025

ఇలాంటి మొక్కజొన్న గింజలకు మంచి ధర

image

మొక్కజొన్నను నూర్పిడి చేసిన తర్వాత మార్కెట్‌లో మంచి ధర రావాలంటే తప్పనిసరిగా కొన్ని నాణ్యతా ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది. నూర్పిడి చేసిన గింజల్లో దుమ్ము, చెత్త, రాళ్లు, మట్టి పెళ్లలు 1 శాతం మించరాదు. గింజల్లో తేమ 14 శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. విరిగిన విత్తనాలు 2 శాతానికి మించరాదు. పాడైపోయిన విత్తనాలు 6 శాతం లోపు ఉండాలి. ఇతర రంగు మొక్కజొన్న గింజలు 6 శాతం మించకుండా ఉండాలి.

News December 5, 2025

పీజీ సెట్ రాయకపోయినా అడ్మిషన్

image

AP: MA, M.Sc, M.Com కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు విద్యాశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది పీజీ సెట్‌ అర్హతను మినహాయించింది. పీజీ సెట్ అర్హత సాధించకపోయినా, సెట్ రాయకపోయినా స్పాట్ కోటా కింద అడ్మిషన్లు చేపట్టేందుకు అవకాశం కల్పించింది. వర్సిటీలు, కాలేజీల్లో మిగిలిన కన్వీనర్ కోటా సీట్లను ఈ స్పాట్ కోటా కింద ఫిల్ చేయాలని ఆదేశించింది. ఈ కోటాలో చేరే విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వర్తించదు.

News December 5, 2025

మా ఇంధనం US కొనొచ్చు.. ఇండియా కొనకూడదా?: పుతిన్

image

ఇంధన కొనుగోళ్ల విషయంలో US అధ్యక్షుడు ట్రంప్ తీరును రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఎండగట్టారు. ‘అమెరికా తమ అణు విద్యుత్ ప్లాంట్ల కోసం మా వద్ద యురేనియం కొనుగోలు చేస్తూనే ఉంది. మా నుంచి ఇంధనం కొనే హక్కు ఆ దేశానికి ఉన్నప్పుడు భారత్‌కు అలాంటి హక్కు లేకుండా ఎందుకు చేయాలి?’ అని India Today ఇంటర్వ్యూలో ప్రశ్నించారు. ఇండియాతో ఇంధన భాగస్వామ్యం స్థిరంగా ఉందని, పాశ్చాత్య ఆంక్షలతో ప్రభావితం కాలేదని స్పష్టం చేశారు.