News August 9, 2025

మూడు విడతల్లో వేతనాల పెంపు: నిర్మాతలు

image

సినీ కార్మికులకు మూడు విడతల్లో వేతనాలు పెంచేందుకు నిర్మాతలు ఓకే చెప్పారు. వేతనం రూ.2వేల(రోజుకు) లోపు ఉన్నవారికి పెంచాలని ఫెడరేషన్ సభ్యులతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. అయితే 30శాతం పెంపునకు సుముఖంగా లేమని తెలిపారు. తొలి విడతలో 15%, రెండో విడతలో 5, మూడో విడతలోనూ 5% పెంచేందుకు ప్రతిపాదనలు చేశారు. చిన్న సినిమాలకు ఇవి వర్తించవని స్పష్టం చేశారు. ఇక కార్మిక ఫెడరేషన్ నిర్ణయం తీసుకోవాలన్నారు.

Similar News

News August 10, 2025

పులివెందులలోని పోలింగ్ కేంద్రాలన్నీ సమస్యాత్మకమే: కడప ఎస్పీ

image

AP: ఈ నెల 12న జరగనున్న పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నిక పోలింగ్‌కు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు కడప SP అశోక్ కుమార్ తెలిపారు. ‘రెండు ప్రాంతాల్లో 1,100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశాం. పులివెందుల జడ్పీటీసీ పరిధిలోని పోలింగ్ కేంద్రాలన్నీ సమస్యాత్మకం. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలుంటాయి. ఈ 2 మండలాల్లో స్థానికేతరులు ఉండకూడదు’ అని SP ఆదేశించారు.

News August 10, 2025

OICLలో 500 ఉద్యోగాలు.. వారమే గడువు

image

ఓరియెంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL) 500 అసిస్టెంట్ (క్లాస్III) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ పాసై ఉండాలి. వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. జీతం నెలకు రూ.45,000 వరకు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులు రూ.850, మిగతావారు రూ.100 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఈ నెల 17లోపు <>orientalinsurance.org.in<<>> సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

News August 10, 2025

ముగిసిన ZPTC ఉపఎన్నికల ప్రచారం

image

AP: కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నికల ప్రచారం ముగిసింది. వైసీపీ, టీడీపీ ఈ ఎలక్షన్స్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఇరు చోట్ల 11 మంది చొప్పున బరిలో ఉన్నారు. పులివెందులలో 15, ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఓటర్ల సంఖ్య పులివెందులలో 10,601, ఒంటిమిట్టలో 24,606గా ఉంది. ఈ నెల 12న బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగనుండగా ఫలితాలు 14న వెలువడనున్నాయి.