News November 11, 2024
ప్రారంభంలో లాభాలు.. చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి

సోమవారం మిడ్ సెషన్ వరకు 251 పాయింట్ల లాభంతో సాగిన నిఫ్టీ చివరికి 6 పాయింట్ల నష్టంతో 24,141 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ కూడా 808 పాయింట్ల లాభం నుంచి 9 పాయింట్ల లాభానికి పతనమై 79,496 వద్ద చలించింది. నిఫ్టీలో 24,300 వద్ద, సెన్సెక్స్‌లో 80,100 వద్ద ఉన్న కీలకమైన రెసిస్టెన్స్‌ను సూచీలు అధిగమించలేకపోయాయి. Power Grid 4.35%, Trent 2.60% లాభపడగా, Asian Paint 8%, Britannia 2.60% నష్టపోయాయి.
Similar News
News October 13, 2025
ఐ మేకప్ తీయకుండా పడుకుంటున్నారా?

రాత్రిళ్లు పడుకొనేముందు మేకప్ తియ్యడం తప్పనిసరి. ముఖ్యంగా ఐమేకప్ తియ్యకపోతే పలు సమస్యలు వస్తాయంటున్నారు చర్మ నిపుణులు. కళ్ల కింద నల్లటి వలయాలు, ఐ ఇన్ఫెక్షన్లు వస్తాయి. అలాగే కనురెప్పలకు వేసే మస్కారా తీయకపోవడం వల్ల కనురెప్పల్లోని నూనె గ్రంథులు మూసుకుపోయి వాటికి తేమ అందదు. వాటి సహజత్వం కోల్పోయి పెళుసుబారి విరిగిపోతాయి. కాబట్టి రాత్రిపూట కళ్లకు వేసుకున్న మేకప్ తొలగించడం మంచిదని సూచిస్తున్నారు.
News October 13, 2025
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, WGL, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, RR, HYD, మేడ్చల్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో వానలు పడవచ్చని పేర్కొంది.
News October 13, 2025
కెంటన్ మిల్లర్ అవార్డు సాధించిన మొదటి భారత మహిళ

కజిరంగా నేషనల్ పార్క్ మొదటి మహిళా ఫీల్డ్ డైరెక్టర్‌గా ఉన్న సొనాలి ఘోష్ సరికొత్త చరిత్ర సృష్టించారు. తాజాగా ప్రపంచంలోని అత్యున్నత గౌరవాలలో ఒకటైన IUCN కెంటన్ మిల్లర్ అవార్డును పొందారు. వణ్యప్రాణుల సంరక్షణకు గానూ ఆమెకు ఈ అవార్డు వచ్చింది. పూణేలో జన్మించిన సొనాలి వైల్డ్‌లైఫ్ సైన్స్, ఎన్విరాన్మెంట్ లా చదివారు. పులులను ట్రాక్ చేసే రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీపై పరిశోధించి డాక్టరేట్ పొందారు.