News November 6, 2024
నవంబర్ 14న విద్యార్థులతో కార్యక్రమం: సీఎం రేవంత్
TG: నవంబర్ 14న 15వేల మంది విద్యార్థులతో ఒక మంచి కార్యక్రమం నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డైట్, కాస్మొటిక్ ఛార్జీలు పెంచినందుకు వైరా, మధిర గురుకుల విద్యార్థులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. SC, ST, BC, మైనార్టీల కోసం యంగ్ ఇండియా స్కూళ్లు, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ కోసం స్కిల్ యూనివర్సిటీ, ఒలింపిక్ పతకాలే లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
Similar News
News November 6, 2024
అకౌంట్లలోకి డబ్బులు.. కీలక ప్రకటన
AP: ఈ విద్యాసంవత్సరం(2024-25) నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు నేరుగా కాలేజీల ఖాతాల్లో జమచేసేలా పాత పద్ధతిని అవలంబిస్తామని మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. బకాయిలు రూ.3,500 కోట్లు విడతల వారీగా చెల్లిస్తామని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కాలేజీలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. కాగా, గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు తల్లుల ఖాతాల్లో డిపాజిట్ అయ్యేవి.
News November 6, 2024
మళ్లీ కెప్టెన్ అయిన డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ మళ్లీ కెప్టెన్సీని చేపట్టారు. బాల్ టాంపరింగ్ కారణంగా ఆయన కెప్టెన్సీ చేయకుండా క్రికెట్ ఆస్ట్రేలియా ఆరేళ్ల క్రితం నిషేధం విధించింది. తాజాగా ఆ నిషేధాన్ని ఎత్తివేయడంతో బిగ్ బాష్ లీగ్లో సిడ్నీ థండర్ ఆయన్ను తమ కెప్టెన్గా నియమించింది. అదే జట్టుకు 2011లో వార్నర్ కెప్టెన్గా ఉన్నారు. IPLలోనూ SRHకి కెప్టెన్గా కప్ అందించారు.
News November 6, 2024
నాకు కాదు DCMకు చెప్పు: అంబటి
AP: హోం మంత్రి అనిత ఎవరో చెప్పాల్సింది తనకు కాదని, DCMకు చెప్పాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. అనిత ఇచ్చుకున్న సెల్ఫ్ సర్టిఫికెట్కు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, చాలా సంతోషంగా ఉందని ఎద్దేవా చేశారు. ‘H.Mగా బాధ్యత వహించండి. నేను బాధ్యత తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి’ అన్న వ్యక్తికి <<14546885>>ఈ విషయాన్ని<<>> చెప్పాలని సూచించారు.