News January 18, 2025

బీదర్, అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో పురోగతి

image

బీదర్‌లో <<15169507>>ఏటీఎం డబ్బులు<<>> చోరీ చేసి, HYD అఫ్జల్‌గంజ్‌లో <<15172705>>కాల్పులు జరిపిన<<>> నిందితుల్లో ఒకరిని పోలీసులు గుర్తించారు. బిహార్‌కు చెందిన మనీశ్, మరికొందరు కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారని, ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని ఓ బ్యాంకులో రూ.70లక్షలు చోరీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. మనీశ్, అతని ముఠా కోసం తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ పోలీసులు గాలిస్తున్నారు.

Similar News

News November 16, 2025

తిరుపతి: విద్యుత్ సమస్యలు ఉంటే కాల్ చేయండి.!

image

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ CMD కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు CMD శివశంకర్ తెలిపారు. సోమవారం ఉదయం 10-12 మధ్య కార్యక్రమం ఉంటుందన్నారు. రాయలసీమ జిల్లాల ప్రజలు సమస్యలు ఉంటే 8977716661కు కాల్ చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. వీటితోపాటు 1912, వాట్సాప్ నం. 91333 31912 ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు.

News November 16, 2025

గురక గాఢనిద్రకు సంకేతం కాదు: వైద్యులు

image

చాలా మంది గురకను గాఢనిద్రకు సంకేతంగా భావిస్తారు. కానీ అందులో నిజం లేదంటున్నారు వైద్యులు. ‘గురక అనేది గొంతులో గాలి వెళ్లే దారి ఇరుకై శ్వాసకు అడ్డంకులు ఏర్పడటం వల్ల వస్తుంది. దీని వలన నిద్రలో అంతరాయం ఏర్పడి గాఢనిద్ర పట్టదు. తరచుగా గురక వస్తున్నట్లయితే అది స్లీప్ అప్నియా వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు’ అని చెబుతున్నారు. మీ ఇంట్లో ఎవరైనా ఎక్కువగా గురక పెడితే వైద్యుడిని సంప్రదించండి.

News November 16, 2025

టీమ్ ఇండియా చెత్త రికార్డు

image

SAతో తొలి టెస్టులో టీమ్ ఇండియా చెత్త రికార్డు నమోదు చేసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో IND ఛేదించలేకపోయిన రెండో అత్యల్ప స్కోర్ (124) ఇదే. 1997లో బ్రిడ్జ్‌టౌన్ వేదికగా జరిగిన మ్యాచులో వెస్టిండీస్‌పై 120 పరుగులను ఛేజ్ చేయలేకపోయింది. ఇప్పుడు దాదాపు 28 ఏళ్ల తర్వాత రెండో లోయెస్ట్ టార్గెట్‌ను ఛేదించడంలో విఫలమైంది. అటు టెస్టుల్లో SA డిఫెండ్ చేసుకున్న రెండో అత్యల్ప టార్గెట్ ఇదే కావడం గమనార్హం.