News March 4, 2025

SLBC టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి

image

TG: SLBC టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి కనిపించింది. సొరంగంలో పనుల కోసం ఉపయోగించే కన్వేయర్ బెల్ట్ మరమ్మతులకు గురికాగా, సాంకేతిక సిబ్బంది దాన్ని పునరుద్ధరించారు. ప్రస్తుతం అది పని చేస్తోంది. దీంతో సొరంగంలోని బురద, మట్టిని తొలగించే ప్రక్రియ వేగవంతం కానుంది. సొరంగంలో చిక్కుకుపోయిన 8మంది ఉద్యోగుల ఆచూకీ కోసం 10 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Similar News

News March 4, 2025

రోహిత్, గిల్ ఔట్

image

ఛాంపియన్స్ ట్రోఫీ: టీమ్ ఇండియాకు ఆరంభంలోనే బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్లు రోహిత్(28), గిల్ (8) ఔటయ్యారు. ప్రస్తుతం భారత్ స్కోర్ 43/2గా ఉంది. విరాట్ (5*), శ్రేయస్ అయ్యర్ (0*) క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి 42 ఓవర్లలో 222 రన్స్ కావాలి.

News March 4, 2025

వింత సమస్యతో బాధపడుతున్న హీరోయిన్!

image

మంచి గుర్తింపు తెచ్చుకున్న పాతతరం హీరోయిన్లలో లైలా ఒకరు. ఇటీవల తనకున్న వింత సమస్య గురించి చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది ఈ భామ. తాను నవ్వకుండా ఉండలేనని, నవ్వు ఆపేస్తే తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయన్నారు. శివపుత్రుడు షూటింగ్ సందర్భంగా విక్రమ్ ఓ నిమిషం పాటు నవ్వకుండా ఉండాలని ఛాలెంజ్ విసరగా, 30సెకన్లకే ఏడ్చేశానని చెప్పుకొచ్చారు. దీంతో మేకప్ అంతా పాడైపోయిందని వివరించారు.

News March 4, 2025

యువత ఆకాంక్షలు నెరవేర్చాలి: మంత్రి లోకేశ్

image

AP: పట్టభద్రుల MLC ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర, పేరాబత్తుల రాజశేఖర్ మంగళగిరిలోని TDP ఆఫీసులో మంత్రి నారా లోకేశ్‌ను కలిశారు. వారికి అభినందనలు తెలిపిన మంత్రి మాట్లాడారు. ‘ఈ విజయంతో మనపై మరింత బాధ్యత పెరిగింది. యువత మనపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చే దిశగా చిత్తశుద్ధితో పని చేయాలి. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది’ అని లోకేశ్ అన్నారు.

error: Content is protected !!