News September 22, 2025

ARCIలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు

image

ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ పౌడర్ మెటలార్జీ అండ్ న్యూ మెటీరియల్స్(<>ARCI<<>>)12 ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 10వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీహెచ్‌డీ, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్, ఎంఫిల్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థులను స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://arci.res.in/careers/

Similar News

News January 15, 2026

నేటి నుంచి అందుబాటులోకి వెస్ట్ బైపాస్‌

image

AP: విజయవాడ వెస్ట్ బైపాస్‌ను నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. గుంటూరు జిల్లా కాజా-చినకాకాని జంక్షన్ నుంచి ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి మీదుగా చిన్న అవుటుపల్లి టోల్‌గేట్‌ జంక్షన్ వరకు ఒకవైపు రహదారిపై అన్ని రకాల వాహనాలకు అనుమతిస్తున్నట్లు NHAI తెలిపింది. గుంటూరు, అమరావతి, విజయవాడ, హైదరాబాద్, ఏలూరు, ఉత్తరాంధ్ర వైపు వెళ్లే వాహనాలకు ఇది కీలక మార్గంగా మారనుంది.

News January 15, 2026

సంక్రాంతి: ఈ వస్తువులు కొంటే శ్రేయస్సు

image

సంక్రాంతి వేళ ఇంటికి శ్రేయస్సు తెచ్చే వస్తువులు కొనడం ఎంతో శుభప్రదమంటున్నారు వాస్తు నిపుణులు. ‘ఇంటి ప్రతికూల శక్తిని తొలగించడానికి విండ్ చైమ్స్, ఆర్థిక స్థిరత్వం కోసం ఉత్తర దిశలో లోహపు తాబేలు, అదృష్టం కోసం క్రిస్టల్ వస్తువులు ఉంచాలి. అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి ప్రధాన ద్వారానికి లక్కీ నాణేలు, దాంపత్య బంధం బలపడటానికి నైరుతి దిశలో మాండరిన్ బాతుల జంటను ఏర్పాటు చేసుకోవాలి’ అని సూచిస్తున్నారు.

News January 15, 2026

ఎయిర్‌స్పేస్ మూసేసిన ఇరాన్

image

ఇరాన్ తాత్కాలికంగా గగనతలాన్ని మూసేసింది. ముందస్తు అనుమతి లేకుండా తమ ఎయిర్‌స్పేస్‌లోకి ఏ విమానాన్ని అనుమతించబోమని ఆ దేశ రక్షణ శాఖ NOTAM జారీ చేసింది. దేశంలో అంతర్గత నిరసనలు, అమెరికాతో పెరుగుతున్న ఘర్షణ వాతావరణం నేపథ్యంలో భద్రతా కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా యూరప్, ఆసియా దేశాల మధ్య విమాన సర్వీసుల్లో కొన్నింటిని దారి మళ్లిస్తుండగా, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.