News April 2, 2024
‘ప్రాజెక్ట్ టైగర్’కు 51 ఏళ్లు.. 70% పులులు భారత్‌లోనే!

దేశంలో పులుల సంరక్షణ, వాటి సంఖ్యను పెంచేందుకు భారత ప్రభుత్వం APR 1, 1973న ‘ప్రాజెక్ట్ టైగర్’ను ప్రారంభించింది. తాజాగా ఈ ప్రాజెక్ట్ 51ఏళ్లు పూర్తి చేసుకుందని ఓ IFS అధికారి ట్వీట్ చేశారు. మొత్తం 9 టైగర్ రిజర్వ్‌లలో పులుల సంరక్షణ కొనసాగుతోందన్నారు. దీంతో 2006లో 1411 పులులుండగా.. 2022లో వాటి సంఖ్య 3682కి చేరినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న పులుల సంఖ్యలో 70% ఇండియాలోనే ఉన్నట్లు వెల్లడించారు.
Similar News
News January 25, 2026
టెన్త్, ఐటీఐ అర్హతతో 260 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(CSL)లో 260 వర్క్‌మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి టెన్త్, సంబంధిత విభాగంలో ITI, NTCతో పాటు పని అనుభవం గలవారు FEB 7వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. నెలకు రూ.23,300 చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ప్రాక్టికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: cochinshipyard.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News January 25, 2026
పవన్ కళ్యాణ్ కుమారుడిపై AI వీడియో.. వ్యక్తి అరెస్ట్

AP Dy.CM పవన్ కల్యాణ్ కుమారుడు అకీరానందన్‌పై AI వీడియో క్రియేట్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా అకీరా ఫొటోలతో హైదరాబాద్‌కు చెందిన నిందితుడు వెంకటరమణ ‘లవ్ స్టోరీ’ అనే 56 నిమిషాల వీడియోను YouTubeలో పోస్ట్ చేశాడు. దీనిపై జనసేన నేత తాటికాయల వీరబాబు ఫిర్యాదు చేయడంతో కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
News January 25, 2026
బంగ్లా క్రికెట్ బోర్డుకు ఎన్ని కోట్ల నష్టం..

T20 వరల్డ్ కప్ నుంచి తప్పుకుని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ₹వందల కోట్లు నష్టపోనుంది. ICC ఏటా ఇచ్చే $27 మిలియన్లు (₹247Cr)తో పాటు తమ దేశంలో మ్యాచుల బ్రాడ్‌కాస్ట్, టీం స్పాన్సర్‌షిప్ అమౌంట్ కోల్పోతుంది. మొత్తంగా BCB 60% ఆదాయం కోల్పోతుందని అంచనా. ఆటగాళ్ల పర్సనల్ యాడ్స్, ప్రమోషన్స్ రెవెన్యూ లాస్ దీనికి అదనం. అటు ఈ Augలో బంగ్లాలో భారత్ ఆడాల్సిన మ్యాచులూ ఆగిపోతే ఆ బోర్డు ఆర్థిక నష్టం మరింత పెరుగుతుంది.


