News April 5, 2025

ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలి: ఉత్తమ్

image

TG: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. డిసెంబర్‌లోపు మొదటిదశ పూర్తి కావాలని నీటిపారుదల శాఖపై సమీక్షలో అధికారులను ఆదేశించారు. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెణ జలాశయాల పనులన్నీ వీలైనంత త్వరగా పూర్తి చేసి, నీరు నిల్వ చేయాలని సూచించారు. అటు జూరాల ప్రాజెక్టులో పూడికతీత పనులు చేపడతామని పేర్కొన్నారు.

Similar News

News April 6, 2025

స్టాలిన్ వ్యాఖ్యలకు ప్రధాని కౌంటర్

image

తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చాక తమిళనాడుకు 300% అధికంగా నిధులు ఇచ్చామని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో రూ.8,300 కోట్ల విలువైన జాతీయ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. కేంద్రం తమ రాష్ట్రానికి నిధులు కేటాయించలేదన్న సీఎం స్టాలిన్ వ్యాఖ్యలకు ప్రధాని కౌంటర్ ఇచ్చారు. రైల్వే బడ్జెట్‌లో 700శాతం అధికంగా నిధులు కేటాయించామన్నారు. మరోవైపు మోదీ కార్యక్రమాన్ని ఎంకే స్టాలిన్ బహిష్కరించారు.

News April 6, 2025

వృద్ధి రేటులో రెండో స్థానంలో ఏపీ: CBN

image

AP: 2024-25 ఆర్థిక సంవత్సరానికిగానూ దేశంలోనే అత్యధిక వృద్ధి రేటు(8.21%) సాధించిన రెండో రాష్ట్రంగా ఏపీ నిలిచిందని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే తమ విధానాలతో రాష్ట్రాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చామన్నారు. వ్యవసాయ పునరుజ్జీవం, తయారీ రంగం, పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు సమష్ఠి కృషితోనే ఇది సాధ్యమైందని తెలిపారు. కాగా 9.69% వృద్ధి రేటుతో TN తొలి స్థానంలో ఉంది.

News April 6, 2025

ధోనీ రిటైర్మెంట్‌పై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

image

CSK స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోనీ 2023 ఐపీఎల్ సీజన్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాల్సిందని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అన్నారు. ఆ సమయంలో ప్రకటన చేసి ఉంటే ఘనంగా వీడ్కోలు దక్కేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కీపింగ్ అదరగొడుతున్నా ఆయన బ్యాటింగ్ తీరుపై చెన్నై అభిమానులే అసహనం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కాగా నిన్నటి మ్యాచుతోనే ధోనీ వీడ్కోలు పలుకుతారని ప్రచారం జరిగినా కోచ్ ఫ్లెమింగ్ అలాంటి లేదన్నారు.

error: Content is protected !!