News April 12, 2025
అడుగంటుతున్న ప్రాజెక్టులు

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాల్లో నీటి నిల్వలు నానాటికీ తగ్గిపోతున్నాయి. వేసవి తీవ్రత పెరుగుతుండటంతో కనీస స్థాయుల్ని దాటి కిందికి పడిపోతున్నాయి. శ్రీశైలం(సామర్థ్యం 215 టీఎంసీలు)లో 39 టీఎంసీలే ఉంది. నాగార్జునసాగర్‌లో(సామర్థ్యం 312 టీఎంసీలు) 141 టీఎంసీల నీరు మిగిలింది. సాగర్‌లో మరో ఐదు అడుగుల మేర నీరు దిగువకు వెళ్తే హైదరాబాద్ జలమండలి అత్యవసర పంపింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.
Similar News
News March 19, 2026
రైల్వేలో 11,127 ఉద్యోగాలకు నోటిఫికేషన్

రైల్వేలో 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ వెలువడింది. మే 15 నుంచి జూన్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్, సంబంధిత విభాగంలో ITI/డిప్లొమా ఉత్తీర్ణత, 18-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి ఏజ్‌లో సడలింపు ఉంటుంది. CBT 1, CBT 2, CBAT, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://indianrailways.gov.in/
News March 19, 2026
పండుగల్లో ఇలా మెరిసిపోండి

☛ ముల్తానీ మట్టి, రోజ్‌వాటర్ కలిపి ప్యాక్ సిద్ధం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి, ఆరిన తర్వాత నీటితో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇది మీ ముఖానికి చల్లదనంతో పాటు మెరుపునిస్తుంది.
☛ పుదీనా ఫేస్ ప్యాక్ చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. పుదీనా ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి ముఖానికి రాసుకోవాలి. ప్యాక్ ఆరిపోయాక చల్లని నీటితో ముఖాన్ని కడగాలి. దీని వల్ల ముఖం తాజాగా మారుతుంది.
News March 19, 2026
ఉగాది: ఈరోజు ఈ మంచి పనులు చేస్తే?

ఉగాది వేళ చేసే పవిత్ర కార్యాలు శుభ ఫలితాలనిస్తాయని పండితులు చెబుతున్నారు. ‘సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. అభ్యంగన స్నానం చేయాలి. కొత్త బట్టలు ధరించి, ఇంటి గుమ్మాలకు మామిడి ఆకుల తోరణాలు, వేప రెమ్మలు కట్టాలి. దీని వల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. సాయంత్రం పంచాంగ శ్రవణం చేయాలి. తద్వారా రాబోయే ఏడాది ఆదాయ వ్యయాలు, గ్రహ గతులపై అవగాహన కలుగుతుంది. ఇష్టదైవ పూజ, దానధర్మాలు చేయడం మంచిది’ అంటున్నారు.


