News April 9, 2025

ప్రముఖ నిర్మాత మృతి

image

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సలీమ్ అక్తర్(87) నిన్న అర్ధరాత్రి మరణించారు. అనారోగ్య సమస్యలతో ముంబైలోని ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రాణీ ముఖర్జీ, తమన్నా వంటి స్టార్ హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఈయనే. ఆమిర్ ఖాన్, బాబీ డియోల్, మిథున్ చక్రవర్తి తదితర అగ్ర నటులతో సినిమాలు చేశారు. కాగా ఇటీవల ప్రముఖ ప్రొడ్యూసర్ మనోజ్ కుమార్ కూడా మృతిచెందిన విషయం తెలిసిందే.

Similar News

News November 23, 2025

RBIలో మెడికల్ కన్సల్టెంట్ ఉద్యోగాలు

image

<>ఆర్బీఐ <<>>5 మెడికల్ కన్సల్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంబీబీఎస్, పీజీ అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు డిసెంబర్ 11 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి గంటకు రూ.1000 చొప్పున చెల్లిస్తారు. వెబ్‌సైట్: rbi.org.in.

News November 23, 2025

వన్డేలకు కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన టీమ్ ఇండియా

image

దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు భారత జట్టుకు కొత్త కెప్టెన్‌ను BCCI ప్రకటించింది. మూడు వన్డేల సిరీస్‌కు రాహుల్ సారథిగా వ్యవహరించనున్నట్లు వెల్లడించింది. బుమ్రా, సిరాజ్‌కు రెస్ట్ ఇవ్వగా గిల్, అయ్యర్ గాయాలతో దూరమయ్యారు.
జట్టు: రోహిత్, జైస్వాల్, కోహ్లీ, తిలక్ వర్మ, రాహుల్(C), పంత్(VC), సుందర్, జడేజా, కుల్దీప్, నితీశ్ కుమార్, హర్షిత్ రాణా, రుతురాజ్, ప్రసిద్ధ్, అర్షదీప్, ధ్రువ్ జురెల్.

News November 23, 2025

ఒకే వేదికపై కేటీఆర్, కవిత?

image

అన్నాచెల్లెళ్లు కేటీఆర్, కవిత ఒకే వేదికపై కనిపించే అవకాశముంది. ఈ నెల 25న చెన్నైలో ‘ABP నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్’‌కు హాజరుకావాలని వీరికి ఆహ్వానం అందింది. ఇప్పటికే KTR వెళ్తానని ప్రకటించగా, కవిత కూడా వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. టైమింగ్స్ ఖరారు కావాల్సి ఉండగా వీరిద్దరూ ఒకే వేదికపై ఎదురుపడతారా అనేది ఆసక్తికరంగా మారింది. BRSను వీడాక కవిత, KTRను ఏ సందర్భంలోనూ కలుసుకోని సంగతి తెలిసిందే.