News December 19, 2024
ప్రముఖ రచయిత కన్నుమూత

AP అరసం గౌరవ సలహాదారు, కథ, నవలా రచయిత కాటూరి రవీంద్ర త్రివిక్రమ్(80) విజయవాడలో గుండెపోటుతో నిన్న కన్నుమూశారు. సాహిత్యంపై ఆసక్తితో 11 ఏళ్లకే రచనా ప్రస్థానం ప్రారంభించారు. 1974లో తొలి కథ ప్రచురితమైంది. 600కు పైగా కథ, కథానిక, నవల, నవలిక, హరికథ, నాటకాలు, 400కు పైగా వ్యాసాలు రాశారు. సైనికుడిగా 1965, 1971లో భారత్-పాక్ యుద్ధాల్లో పాల్గొన్నారు. హైకోర్టు లాయరుగా, బార్ అసోసియేషన్ జీవితకాల సభ్యుడిగా ఉన్నారు.
Similar News
News September 15, 2025
కలెక్టర్ల సదస్సుకు పవన్ దూరం.. కారణమిదే?

AP: ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న కలెక్టర్ల సదస్సుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరయ్యారు. మహాలయ పక్షాలను అనుసరించి పితృకర్మ పూజలు ఉండటంతో రాలేదని ఆయన PR0 తెలిపారు. ఈ రోజునే ప్రారంభమైన పితృకర్మ పూజలో పవన్ పాల్గొంటున్నారని చెప్పారు. దీంతో రేపు కలెక్టర్ల సదస్సులో డిప్యూటీ సీఎం పాల్గొంటారని పేర్కొన్నారు.
News September 15, 2025
మరో వివాదంలో పూజా ఖేడ్కర్

మహారాష్ట్రకు చెందిన మాజీ ట్రైనీ IAS పూజా ఖేడ్కర్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ ట్రక్ డ్రైవర్ కిడ్నాప్ విషయంలో ఆమె పేరు బయటికి వచ్చింది. ముంబైలోని ఐరోలిలో డ్రైవర్ ప్రహ్లాద్ కుమార్ తన ట్రక్‌తో ఓ కారును ఢీకొట్టారు. దీంతో కారులోని ఇద్దరు వ్యక్తులు అతడిని కిడ్నాప్ చేశారు. పోలీసులు లొకేషన్ ట్రేస్ చేయగా పుణేలోని పూజా ఇంటిలో చూపించింది. డ్రైవర్‌ను విడిపిస్తున్న క్రమంలో పూజా తల్లి మనోరమ హంగామా చేశారు.
News September 15, 2025
దులీప్ ట్రోఫీ విజేతగా సెంట్రల్ జోన్

దులీప్ ట్రోఫీ విజేతగా సెంట్రల్ జోన్ జట్టు నిలిచింది. బెంగళూరులో జరిగిన ఫైనల్లో సౌత్ జోన్‌పై ఆ జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచులో సెంట్రల్ జోన్ ప్లేయర్స్ యశ్ రాథోడ్(194), కెప్టెన్ పాటీదార్(101) సెంచరీలతో చెలరేగారు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా సారాన్ష్ జైన్(8 వికెట్లు, 69 రన్స్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా యశ్ (194, 13 రన్స్) నిలిచారు. స్కోర్లు: సౌత్ జోన్ 149&426, సెంట్రల్ జోన్ 511&66/4.